భారత్‌లో కరోనా మరణ మృదంగం
11,903కు చేరిన మృతుల సంఖ్య
మహారాష్ట్రలో మహమ్మారి మృత్యుకేళి
దేశంలో వరుసగా ఆరవ రోజూ 10 వేలకు పైగా పాజిటివ్‌లు
3,54,065కు పెరిగిన బాధితుల సంఖ్య
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తుంది. మృతుల సంఖ్య 12 వేలకు చేరువలో ఉంది. తాజా గా మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 2003 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం మరణా ల సంఖ్య 11,903కు చేరింది. అయితే మహారాష్ట్ర, ఢిల్లీలో పెండింగ్‌లో ఉన్న మరణాల సంఖ్యను చేర్చడంతో ఈ సంఖ్య భారీగా పెరిగింది. కొత్తగా నమోదైన 2003 మృతుల్లో ఒక్క మహారాష్ట్రలోనే 1409 మంది ఉన్నారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 5,537కు చేరుకుంది. అదే విధంగా దేశ రాజధాని ఢిల్లీలోని 24 గంటల్లో భారీగా మరణాలు సం భవించాయి. కొత్తగా 437 మంది మృతి చెందగా, రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 1,837కు పెరిగింది. ఇక కరోనా పాజిటివ్ కేసులు కూడా నిత్యం గణనీయంగా పె రుగుతున్నాయి. వరుసగా ఆరవ రోజు కూడా 10 వేలకు పైగా కేసులు న మోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 10,974 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 3,54,065గా నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. మొత్తం బాధితుల్లో ఇప్పటి వరకు 1,86,934 మంది వైరస్ నుంచి కోలుకోగా, 1,55,227 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికరీ రేటు 52.79గా ఉన్నట్లు మంత్రిత్వశాఖకు చెందిన ఒక అధికారి చెప్పారు. కాగా, దేశంలో గడచిన 17రోజుల్లోనే కరోనా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య రెట్టిం పు అయ్యింది. మే 31తేదీ వరకు దేశంలో లక్షా 82వేల పాజిటివ్ కేసులు, 5164 మరణాలు నమోదయ్యాయి. కాగా జూన్ 17నాటికి కేసులతోపా టు మరణాల సంఖ్య కూడా దాదాపు రెట్టింపు అ య్యింది. ప్రపంచంలో కరోనా మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్ ప్రపంచంలోనే ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్యలో మాత్రం భారత్ ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది. రోజువారీగా చూ స్తే, అమెరికా, బ్రెజిల్, భారత్‌లలోనే నిత్యం పదివేల చొప్పున పాజిటివ్ కే సులు నమోదవుతున్నాయి. ఇదిలా ఉండగా, మంగళవారం ఉదయం నుంచి తమిళనాడులో 49 మంది, గుజరాత్‌లో 28, ఉత్తరప్రదేశ్, హర్యానాలో 18 మంది చొప్పున, మధ్యప్రదేశ్‌లో 11 మంది, పశ్చిమ బెంగాల్ లో 10 మంది, రాజస్థాన్‌లో ఏడుగురు, కర్నాటకలో ఐదుగురు, తెలంగాణలో నలుగురు, బీహార్, ఛత్తీస్‌గఢ్, జమ్మూకశ్మీర్, జార్ఖండ్, పంజాబ్, పుదుచ్చేరి, ఉత్తరాఖండ్‌లో ఒకరు చొప్పున మరణించారు. ఇప్పటి వరకు సంభవించిన మొత్తం 11,903 మరణాల్లో మహారాష్ట్రలోనే అత్యధికంగా 5,537 మంది కరోనా వైరస్‌కు బలయ్యారు. దేశ వ్యాప్తంగా నమోదైన మరణాల సంఖ్యలో దాదాపు సగం మరణాలు మహారాష్ట్రలోనే సంభవించడం కలవర పెడుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలోని మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తుంది. మొత్తం మరణాల సంఖ్య 1,837కు చేరింది. మ రణాల సంఖ్యలో మూడవ స్థానంలో ఉన్న గుజరాత్‌లో మొత్తం 1,533, తమిళనాడులో 528, పశ్చిమ బెంగాల్‌లో 495, మధ్యప్రదేశ్‌లో 476, ఉత్తరప్రదేశ్‌లో 417, రాజస్థాన్‌లో 308, తెలంగాణలో 191, హర్యానాలో 118, కర్నాటకలో 94, ఆంధ్రప్రదేశ్‌లో 88, పంజాబ్‌లో 72, జమ్మూకశ్మీర్‌లో 63, బీహార్‌లో 41 మంది, ఉత్తరాఖండ్‌లో 25 మంది, కేరళలో 20 మంది, ఒడిశాలో 11 మంది, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లో 9 మంది చొప్పున, అసోం, హిమాచల్‌లో 8 మంది చొప్పున, చండీగఢ్, పుదుచ్చేరిలో ఆరుగురు చొప్పున , మేఘాలయ, త్రిపుర, లడఖ్‌లో ఒకరు చొప్పు మృతి చెందినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. ఇప్పటి వరకు నమోదైన మరణాల్లో 70 శాతం మంది ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారేనని పేర్కొంది. ఇక రాష్ట్రాల వారీగా కేసులు చూస్తే అత్యధిక కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. 1,13,445 కేసులతో రాష్ట్రం దేశంలోనే తొలి స్థానంలో కొనసాగుతుంది. తమిళనాడులో 48,019 కేసులు నమోదయ్యాయి. ఇక ఢిల్లీలో 44,688, గుజరాత్‌లో 24,577, ఉత్తరప్రదేశ్‌లో 14,091, రాజస్థాన్‌లో 13,216, పశ్చిమ బెంగాల్‌లో 11,909, మధ్యప్రదేశ్‌లో 11,083, హర్యానాలో 8,272, కర్నాటకలో 7,530, బీహార్‌లో 6,778, ఆంధ్రప్రదేశ్‌లో 6,841, తెలంగాణలో 5,406, జమ్మూకశ్మీర్‌లో 5,298, అసోంలో 4,319, ఒడిశాలో 4,163, పంజాబ్‌లో 3,371, కేరళలో 2,622, ఉత్తరాఖండ్‌లో 1,942, జార్ఖండ్‌లో 1,839, ఛత్తీస్‌గఢ్‌లో 1,781, త్రిపురలో 1,092 మందికి కరోనా సోకింది. అదే విధంగా లడఖ్‌లో 649, గోవాలో 629 మంది, హిమాచల్‌లో 560 మంది కొవిడ్ 19 బారిన పడ్డారు. మణిపూర్‌లో 500, చండీగఢ్‌లో 358, పుదుచ్చేరిలో 216, నాగాలాండ్‌లో 179 కేసులు ఇప్పటి వరకు నమోదయ్యాయి. ఇక మిజోరాంలో 121, అరుణాచల్‌లో 95, సిక్కింలో 70, దాదర్ నగర్ హవేలీ, దామన్ డియోలో 45, మేఘాలయ, అండమాన్ నికోబార్‌లో 44 కేసులు నమోదయ్యాయి. మరో 8,273 కేసులుకు సంబంధించి రాష్ట్రాలు వెల్లడిస్తాయని ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది.
ఒక్క రోజే 2003 మరణాలు
RELATED ARTICLES