వారం రోజుల పాటు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్న పాజిటివ్‌లు
24 గంటల వ్యవధిలో మరో 971 మంది మృత్యువాత
దేశంలో 68 లక్షలు దాటిన బాధితులు
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గత వారం రోజుల పాటు రోజువారీ కేసుల సంఖ్య తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తున్నాయి. మూడు రోజుల క్రితం 60 వేలకుపైగా వెలుగు చూసిన కేసులు తాజాగా 80 వేల మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దేశంలో బాధితుల సంఖ్య 68 లక్షలు దాటిం ది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 58 లక్షలు దాటి దూసుకెళ్తుంది. బుధవారం ఉద యం నుంచి గురువారం ఉదయం నాటికి గడిచిన 24 గంటల్లో కొత్తగా 78,524 కేసులు వెలుగు చూశాయి. దీంతో బాధితుల సంఖ్య 68,35,655కి చేరింది. మరోవైపు ఒక్క రోజు వ్యవధిలో కొవిడ్‌తో మరో 971 మంది ప్రాణా లు కోల్పోయారు. ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 1,05,526కు చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. మరణాల రేటు 1.54 శాతానికి పడిపోయినట్లు మంత్రిత్వశాఖ వెల్లడించింది. కొవిడ్ 19తో మరణిస్తున్న వారిలో దాదాపు 70 శాతానికిపైగా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారేనని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేస్తుంది. 24 గంటల్లో కొత్తగా 83,011 మంది కరోనాను జయించారు. గత వారం రోజుల నుంచి గత నాలుగైదు రోజుల నుంచి కొత్త కేసుల కంటే కొత్త రికవరీ సంఖ్యే ఎక్కువగా నమోదవుతున్నాయి.
కొత్త రికవరీలతో కలిపి గురువారం ఉదయం నాటికి 58,27,704 మంది మహమ్మారి నుంచి రికవరీ అయ్యారు. రికవరీ రేటు 85.25 శాతానికి ఎకబాకింది. ఇక యాక్టివ్ కేసుల రోజు రోజుకు క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుం దేశంలో 9,02,425 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కరోనా కేసుల్లో ఈ సంఖ్య 13.20 శాతం మాత్రమేనని మంత్రిత్వశాఖ పేర్కొంది. దేశంలో ఆగస్టు 7న కరోనా బాధితుల సంఖ్య 20 లక్షల మార్క్ దాటగా, ఆగస్టు 23 నాటికి 30 లక్షలు, సెప్టెంబర్ 5 నాటికి 40 లక్షలకు చేరుకోగా, సెప్టెంబర్ 16 నాటికి 50 లక్షలు, సెప్టెంబర్ 28న ఆ సంఖ్య 60 లక్షలు దాటింది. అయితే లక్ష కేసులు నమోదు కావడానికి 110 రోజుల సమయం పట్టింది.
ఒక్క రోజులో 78,524 కేసులు
RELATED ARTICLES