న్యూ ఢిల్లీ : వరల్డ్ నంబర్ వన్ రెజ్లర్ భజరంగ్ పూనియా మరో రెజ్లర్ సంగీతా ఫోగట్‌ను త్వరలో వివాహమాడనున్నాడు. ఈ మేరకు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, వీరి వివాహం 2020 టోక్యో ఒలింపిక్స్ ముగిసిన తర్వాత జరుగనుంది. ప్రస్తుతం భజరంగ్ పూనియా వరల్డ్ రెజ్లింగ్ ర్యాంకింగ్స్‌లో 65 కేజీల విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, సంగీతా ఫోగట్ మహిళల 59 కేజీల విభాగంలో జాతీయ స్ధాయిలో విజేతగా నిలిచింది. సంగీతా ఫోగట్ ఎవరో కాదు ఫోగట్ సిస్టర్స్‌లో ఒకరు. 2010 కామన్‌వెల్త్ గేమ్స్‌లో రెజ్లింగ్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించిన గీతా ఫోగట్ సోదరి. సంగీతా ఫోగట్ తండ్రి మహవీర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ పిల్లల అభిప్రాయాన్ని తాను గౌరవిస్తున్నట్లు తెలిపాడు. ఇదిలా ఉంటే, గీతా ఫోగట్ కూడా పవన్‌కుమార్ అనే రెజ్లర్‌ను 2016లో పెళ్లాడింది. ఇక, మాజీ రెజ్లర్ మహావీర్‌సింగ్ జీవితం అధారంగానే అమీర్‌ఖాన్ ముఖ్యపాత్ర పోషించిన ’దంగల్’ సినిమాను చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రికార్డులు నెలకొల్పింది. ఇదిలా ఉంటే, టోక్యో వేదికగా 2020లో జరగనున్న ఒలింపిక్స్‌లో బజరంగ్ పునియా భారత్ తరఫున ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు.
ఒక్కటి కానున్న పునియా, ఫోగట్
RELATED ARTICLES