యువతీయువకులకు వివాహ వయసు
న్యూఢిల్లీ : స్త్రీ పురుషులకు ఒకే వివాహ వయసు ఉండాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించడానికి సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. న్యాయవాది అశ్వనీ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ జె.బి.పార్థీవాలా ధర్మాసనం కొట్టివేసింది. దేశంలో యువకుల వివాహ వయసు 21 సంవత్సరాలు, యువతుల వివాహ వయసు 18 సంవత్సరాలుగా చట్టం నిర్దేశించింది. యువతుల వివాహ వయసు కూడా 21 ఏళ్ళుగా సవరించాలని అశ్వనీ ఉపాధ్యాయ తన పిటిషన్‌లో కోరారు. వారి వయసును 21 ఏళ్ళుగా నిర్దేశించాలంటే శాసనాన్ని సవరించాల్సిన అవసరం ఉందని, ఇలాంటి విషయాల్లో పార్లమెంటుకు సు్రప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని, చట్టసభ స్వతంత్రంగా ఇలాంటి శాసనాలు చేయవలసి ఉంటుందని పేర్కొంటూ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. యువతులకు ఒక విధమైన వివాహ వయసు, యువకులకు ఒకవిధమైన వివాహ వయసు నిర్దేశించడం ద్వారా చట్ట స్త్రీలు పురుసుల పట్ల వివక్ష చూపిస్తోందని, స్త్రీ పురుష సమానత్వం ఈ విషయంలో కొరవడిందని పిటిషనర్ పేర్కొన్నారు. మహిళలపట్ల తీవ్రమైన వివక్ష దేశంలో కొనసాగుతోందని పిటిషనర్ ఫిర్యాదు చేశారు. దీనిని తీవ్రంగా ఖండించారు.
ఒకే వివాహ వయసు పిటిషన్ తిరస్కరణ
RELATED ARTICLES