నేపాల్ ప్రధాని ఒలికి ఎన్నికల సంఘం సూచన
ఖాట్మాండు : నేపాల్‌లో నవంబర్‌లో మధ్యంతర ఎన్నికలను ఒక విడతలో పూర్తి చేయాలని అక్కడి ఎన్నికల కమిషన్ (ఇసి) యోచిస్తున్నది. కొవిడ్ మహమ్మారి విలయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు నేపాల్ ప్రధాని కెపి శర్మ ఒలికి సూచన కూడా చేసింది. అధికార కమ్యూనిస్టు కూటమిగానీ, నేపాల్ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమిగానీ శుక్రవారంలో గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమై న బలాన్ని నిరూపించుకోలేకపోయాయని పేర్కొంటూ, ప్రెసిడెంట్ బిద్యా దేవి భండారీ పార్లమెంటును రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నవంబరు 12, 19 తేదీల్లో మధ్యంతర ఎన్నికలు జరుగుతాయని ప్రెసిడెంట్ బిద్యా దేవి ప్రకటించగా, నేపాల్ ఇసి మాత్రం ఒకే విడత పోలింగ్‌లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఆశిస్తున్నది. నవంబర్‌లో ఎన్నికలను నిర్వహించేందుకు తగినంత సమయం ఉంది కాబట్టి, ఒక విడత పోలింగ్ సరిపోతుందని ప్రధాని ఒలికి సూచించినట్టు నేపాల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దినేష్ కుమార్ తపాలియా పేర్కొన్నారు. ఈలోగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన వాతావరణాన్ని అన్ని రాజకీయ పార్టీలు నెలకొల్పుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలావుంటే, పార్లమెంటును రద్దు చేస్తూ నేపాల్ ప్రెసిడెంట్ బిద్యా దేవి భండారీ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టులో సవాలు చేయాలని ప్రతిపక్ష కూటమి నిర్ణయించింది. ప్రధాని ఓలీ సిఫారసు మేరకు 2020 డిసెంబరులో కూడా బిద్యా దేవి భండారీ ప్రతినిధుల సభను రద్దు చేశారు. దీంతో నేపాల్ రాజకీయాల్లో అనిశ్చితి ఏర్పడింది. ప్రతినిధుల సభ రద్దును సుప్రీంకోర్టు ఫిబ్రవరిలో రద్దు చేసింది. ఈ నేపథ్యంలో నేపాల్ ప్రతిపక్ష కూటమి మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. ప్రధాని, ప్రెసిడెంట్ రాజ్యాంగ విరుద్ధమైన, అప్రజాస్వామికమైన నిర్ణయం తీసుకున్నారని ఆరోపించింది.
కట్టుదిట్టమైన భద్రత
నేపాల్ పార్లమెంటును రద్దు చేసి, నవంబర్‌లో మధ్యంతర ఎన్నికల నిర్వాహణకు ప్రెసిడెంట్ బిద్యా దేవి ఆదేశాలు జారీ చేసిన తర్వాత నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. రాజకీయ పార్టీలు, ప్రత్యేకించి ప్రతిపక్ష కూటమి ఆందోళనలు, ఘర్షణలు, విధ్వంసాలకు దికుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నేపాల్‌లో మరోసారి రాజకీయ సంక్షోభం నెలకొన్న తరుణంలో, ఎప్పుడు ఏం జరుగుతుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతున్నది.
ఒకే విడతలో… మధ్యంతర ఎన్నికలు
RELATED ARTICLES