మణిపూర్ బౌలర్ రెక్స్ రికార్డు
న్యూఢిల్ీ: క్రికెట్‌లో మరో సంచలనం నమోదైంది. బిసిసిఐ ఆధ్వర్యంలో జరుగుతున్న కుచ్ బెహార్ అండర్-19 క్రికెట్ టోర్నమెంట్‌లో మణిపూర్ బౌలర్ రెక్స్ రాజ్‌కుమార్ ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు. మణిపూర్, అరుణచల్‌ప్రదేశ్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో రెక్స్ రాజ్‌కుమార్ నిప్పులుచెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్స్‌ను హడలెత్తించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టిన రెక్స్, రెండో ఇన్నింగ్స్‌లో 9.5 ఓవర్లు వేసిన రెక్స్ 11 పరుగులు మాత్రమే ఇచ్చి 10 వికెట్లు పడగొట్టాడు. దీంతో అరుణచల్ ప్రదేశ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో మణిపూర్ జట్టు పది వకెట్లతో ఘన విజ యం సాధించింది. అరుణచల్ ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 138 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకు ఆలౌట్ కాగా.. మ ణిపూర్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 122 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్‌లో 55/0 పరుగులు చేసి విజయం సాధించింది.
ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు
RELATED ARTICLES