యువతి సహా మరో ఇద్దరు ఇంటర్ విద్యార్థినులు
పటాన్‌చెరు పోలీస్టేషన్ పరిధిలో ఘటన
ప్రజాపక్షం/ పటాన్‌చెరు : ఒకే రోజు ముగ్గురు అమ్మాయిలు అదృశ్యమైన ఘటన బుధవారం పటాన్‌చెరు పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కనిపించకుండాపోయిన వారిలో సాప్ట్‌వేర్ ఉద్యోగితో పాటు ఇద్దరు ఇంటర్ విద్యార్థునులు ఉన్నా రు. రెండు వేరువేరు ఘటనలు కాగా, ఇం టర్ విధ్యార్థులు మాత్రం ఇరువురు స్నేహితులు. ఈ కేసుకు సంబంధించి పటాన్‌చెరు పోలీసులు తెలిపిన వివరాలిలా ప్రకారం.. పటాన్‌చెరు పట్టణం ఆల్వీన్‌కాలనీకి చెందిన ఆకుల వసంత భర్త యాదగిరి కూతురు ఆకుల ప్రశాంతి (17), అదే కాలనీకి చెందిన చాకలి క్రిష్ణమూర్తి కూతురు చాకలి గాయత్రి (17) స్నేహితులు. ఈ నెల 11వ తేదీ ఉదయం 10 గంటలకు పటాన్‌చెరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెళ్లివస్తామంటూ ఇంట్లో నుండి బయలుదేరి వెళ్లారు. తిరిగి సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో విద్యార్థినిల తల్లితండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో వెతికినప్పటికీ వారి ఆచూకి తెలియకపోవడంతో చివరకు పటాన్‌చెరు పోలీసులను ఆశ్రయించారు. ఆకుల ప్రశాంతి తల్లి ఆకుల వసంత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రవీన్ రెడ్డి తెలిపారు.
మరో కేసులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిః ఇదిలా ఉంటే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న తమ అమ్మాయి కనిపించడం లేదంటూ పటాన్‌చెరు పట్టణ శివారులోని కృషి డిఫెన్స్ కాలనీలో నివసిస్తున్న రాంరెడ్డి బుధవారం పటాన్‌చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ ప్రవీన్ రెడ్డి కథనం ప్రకారం పటాన్‌చెరు కృషి డిఫెన్స్ కాలనీకి చెందిన పి. రాంరెడ్డి కూతురు పి. శివాణి (24) వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. మంగళవారం ఉదయం పది గంటలకు ఇంటర్వ్యూకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి బయలుదేరి వెళ్లింది. తిరిగి సాయంత్రం తన స్నేహితుడు సాయికిరణ్‌రెడ్డికి ఫోన్ చేసి తాను లింగంపల్లి వద్ద ఉన్నానని, తనను ఇంటి దగ్గర దింపి వెళ్లాలని కోరింది. ఈ క్రమంలో సాయికిరణ్ శివాణిని తన వాహనంపై ఆమె నివాసం వద్ద దింపి వెళ్లిపోయాడు. కాలనీ వద్ద దిగిన శివాని ఇంటికి రాలేదంటూ తండ్రి రాంరెడ్డి పటాన్‌చెరు పోలీసులను ఆశ్రయించారు. రాంరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఫిర్యాదు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రవీన్ రెడ్డి తెలిపారు. ఇదిలా ఉంటే ఈ రెండు కేసులలోను ప్రేమ వ్యవహారమే ప్రధాన అంశంగా ఉన్నట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా అమ్మాయిల అదృశ్యంపై సంచలన వార్తలు వస్తుండటంలో కొద్ది రోజుల్లోనే కేసును ఛేదిస్తామని ఎస్‌ఐ ప్రవీన్ రెడ్డి తెలిపారు.