ప్రజాపక్షం/హైదరాబాద్ : కొన్ని మీడియా సంస్థలకు, జర్నలిస్టులకు అన్యా యం చేసే విధంగా చేస్తున్న రాష్ర్ట సమాచార శాఖ కమిషనర్ అరవింద్‌కుమార్‌పై ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజెయు), తెలంగాణ రాష్ర్ట వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టియుడబ్ల్యుజె) ఫిర్యాదు చేశాయి. కమిషనర్ అనుసరిస్తున్న అప్రజాస్వామిక వైఖరిపై చర్యలు తీసుకోవాలని పిసిఐ చైర్మన్ జస్టిస్ సి.కె. ప్రసాద్‌ను గురువారం యూనియన్ ప్రతినిధి బృం దం కలిసి వినతి పత్రాన్ని అందజేసింది. వివిధ కేసుల విచారణలో భాగంగా హైదరాబాద్ వచ్చిన ప్రెస్ కౌన్సిల్ విచారణ కమిటీని ఈ బృందం టూరిజం ప్లాజాలో కలిసింది. రాష్ర్టంలో కొన్ని మీడియా సంస్థలను కమిషనర్ టార్గెట్ చేసి ఉద్దేశపూర్వకంగా వారిని ఇబ్బంది పెడుతున్నట్లు యూనియన్ ప్రతినిధి బృందం ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళింది.పిసిఐ ఛైర్మెన్ ను కలిసిన వారిలో ఐజెయు అధ్యక్షులు దేవులపల్లి అమర్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులుఎం.ఏ.మాజీద్, పిసిఐ మాజీ సభ్యు లు అమర్ నాథ్, ఐజెయు కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, టియుడబ్ల్యుజె రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ తదితరులు ఉన్నారు. రాష్ర్ట శాసన సభ సెక్రెటెరియట్ గుర్తింపు పొందిన మీడియా సంస్థలను సైతం కమిషనర్ బేఖాతర్ చేస్తున్నారని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ నియ మ నిబంధనల ప్రకారం ఎంప్యానెల్‌మెంట్‌కు పూర్తి అర్హతలు కలిగి ఉన్న పలు పత్రికలను (ప్రజాపక్షం, వెలుగు తదితర పత్రికలు)ఆ జాబితాలో చేర్చేందుకు కమిషనర్ తిరస్కరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అలాగే అక్రెడిటేషన్ నియమ నిబంధనల ప్రకారం ఎం ప్యానెల్ మెంట్ లేకున్నా, ఆరు నెలలు పూర్తయిన మీడి యా సంస్థలు అక్రెడిటేషన్ కార్డులకు అర్హులైనప్పటికీ, సమాచార శాఖ అధికారులు దానిని అమలు చే యడం లేదని ప్రెస్ కౌన్సిల్ చైర్మన్‌కు వివరించారు. కమీషనరు వైఖరిపై స్పందించి జర్నలిస్టులకు న్యాయం చేకూర్చాలని ఐజెయు,టియుడబ్ల్యుజె నాయకులు విజ్ఞప్తి చేసారు.
ఐ అండ్ పిఆర్ కమిషనర్‌పై పిసిఐకి టియుడబ్ల్యుజె ఫిర్యాదు
RELATED ARTICLES