న్యూఢిల్లీ: భారత్, ఐస్‌లాండ్ దేశాల మధ్య గల ద్వై పా క్షిక సంబంధాలను మరింత పటిష్టపరుచు కోనేలా రెం డు దేశాలు కృషి చేయాల్సిన అవసరముందని విదే శాం గ శాఖ మంత్రి సుష్మస్వరాజ్ అన్నారు. శనివారం ఆమె ఐస్‌లాండ్ విదేశాంగ మంత్రి గులాగుర్ పొర్‌తో కలిసి న్యూఢిల్లీ నుంచి ఐస్‌లాండ్ రాజధాని రియోక్ జావిక్‌ల మధ్య విమాన సర్వీసులను ప్రారంభించారు. అనం తరం గులాగుర్ పొర్‌తో భేటీ అయిన సుష్మ.. ఇరు దేశాలకు సంబంధించిన వ్యాపార, పెట్టుబడులు, శక్తి వనరులు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చిం చారు. ప్రస్తుతం జియోథెర్మల్ ఎనర్జీ విషయంలో ఐస్ లాండ్ ప్రపంచంలో కీలక స్థానంలో ఉంది. కావునా ఐస్‌లాండ్ సహకారంతో భారత్‌లో కాలుష్య ఉద్గారాలను తగ్గించుకొనే అంశంపై ఇరువురు నేతలు చర్చించారు. చేపల పెంపకం, పర్యాట కం,సాంస్కృతిక వంటి విషయాలపై కూడా సుష్మ, గులాగుర్ పొర్ చర్చలు జరిపారు.
ఐస్‌లాండ్ విదేశాంగ మంత్రితో సుష్మ భేటీ
RELATED ARTICLES