ఆమె కూతురు ఆరాధ్యకు కూడా పాజిటివ్
జయాబచ్చన్‌కు నెగెటివ్
ముంబయి: ప్రముఖ నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్‌కు కరోనా సోకింది. ఆమెతోపాటు కూతురు ఆరాధ్యకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్‌కు శనివారం కరోనా పాజిటివ్ రావడంతో కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించారు. వాటిలో ఐశ్వర్య, ఆరాధ్య శాంపిల్స్‌కు పాజిటివ్ వచ్చింది. ఇప్పటికే ఐశ్వర్య భర్త అభిషేక్‌కు పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే అమితాబ్ భార్య జయా బచ్చన్‌కు నెగిటివ్ వచ్చింది. అమితాబ్ ఫ్యామిలిలో ఇప్పటికే నలుగురికి కరోనా సోకడంతో అమితాబ్ ఇంటి పరిసరాలను కంటైన్మెంట్ జోన్ గా అధికారులు ప్రకటించారు.
నిలకడగా అమితాబ్ ఆరోగ్యం కరోనా పాజిటివ్ రావడంతో ఆస్పత్రిలో చేరిన బిగ్ బి అమితాబ్‌బచ్చన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని నావావతి ఆస్పత్రి వర్గాలు ఆదివారం ప్రకటించాయి. లక్షణాలు స్వల్ప స్థాయిలో ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలోని ఐసోలేషన్ విభాగంలో ఉన్నట్లు తెలిపారు.
ఐశ్వర్యరాయ్‌కుకరోనా
RELATED ARTICLES