తొలి మ్యాచ్ మార్చి 29న.. చివరి మ్యాచ్ మే 17న
డబుల్ హెడర్స్ మ్యాచ్‌లు ఆదివారానికే పరిమితం
ముంబయి : ఈసారి ఐపీఎల్ ప్రారంభమ్యాచ్ గతేడాది ఐపీఎల్ ఫైనల్‌ను తలపించనుందని తెలుస్తోంది. ఇప్పుడున్న సమచారం ప్రకారం వచ్చే నెల 29 నుంచి ఐపీఎల్ లీగ్ దశ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ప్రాంచైజీలకు పంపినట్లుగా చెబుతున్న షెడ్యూల్‌ను బట్టి.. ప్రారంభమ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్-, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగే అవకాశముంది. వచ్చేనెల 29న ఈ మ్యాచ్ ముంబయిలో నిర్వహిస్తారు. అలాగే ఆఖరి మ్యాచ్‌ను మే 17న ముంబయి, -రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. అయితే డబుల్ హెడర్స్ (ఒకే రోజు రెండు మ్యాచ్‌లు) సంఖ్యను ఆదివారానికే పరిమితం చేశారు. ఒకటి మాత్రమే శనివారం జరుగుతుంది. మరోవైపు నాకౌట్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించలేదు. ఈసారి డబుల్ హెడర్స్ తక్కువ సంఖ్యలో ఉండటంతో గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువ సమయం పాటు అనగా 50 రోజుల పాటు లీగ్ దశ సాగనుంది. అయితే ఐపీఎల్ షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించనప్పటికీ ట్విట్టర్‌లో మూడు ఐపీఎల్ జట్లు తాము ఆడబోయే మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఈ షెడ్యూల్‌ను ట్వీట్ చేశాయి. వచ్చే నెలలో సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ అనంతరం 11 రోజుల తర్వాత ఐపీఎల్ ప్రారంభంకానుందని తెలుస్తోంది.
ఆల్ స్టార్ మ్యాచ్ విశేషం..
ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారిగా ఓ ఛారిటీ మ్యాచ్‌ను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించుకుంది. సరిగ్గా టోర్నమెంట్ ప్రారంభం కానున్న మూడు రోజులకు ముందు ఈ మ్యాచ్ జరగనుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నార్త్, ఈస్ట్(ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్) ఫ్రాంచైజీలు ఒక జట్టు గానూ.. సౌత్, వెస్ట్(చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్) ఫ్రాంచైజీలు మరో జట్టుగా కలిసి ఆడనున్నాయని తెలుస్తోంది. ఇక ఈ కాన్సెప్ట్ రూపకర్తలు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్‌లని సమాచారం. ఇక ఈ ఛారిటీ మ్యాచ్.. వెస్ట్, సౌత్ ఫ్యాన్స్‌కు పండగనే చెప్పాలి. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, డివిలియర్స్, షేన్ వాట్సన్, బుమ్రా, మలింగా వంటి స్టార్ ప్లేయర్లు ఒకే టీమ్ తరపున ఆడనున్నారు. అంతేకాక నార్త్ అండ్ ఈస్ట్ ఫ్రాంచైజీల ఫ్యాన్స్.. రస్సల్, పంత్, స్టోక్స్, బట్లర్, శ్రేయాస్ అయ్యర్, ప్యాట్ కమ్మిన్స్, మోర్గాన్, స్టీవ్ స్మిత్, ఆర్చర్ వంటి ఆటగాళ్లను సేమ్ టీమ్‌లో చూడవచ్చు. సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరిట గుజరాత్‌లో కొత్తగా నిర్మితమైన అతి పెద్ద క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుందని సమాచారం. అంతేకాకుండా తలా ధోని ఈ మ్యాచ్‌తో క్రికెట్‌కు రీ-ఎంట్రీ ఇస్తున్నాడు. సో లెట్స్ వెయిట్ అ్‌ండ సీ గయ్స్.
ఏప్రిల్ 1నుంచి హైదరాబాద్‌లో
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ ‘హోం’ మ్యాచ్‌లను ఎప్పటిలాగే ఉప్పల్‌ో్లని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆడనుంది. హైదరాబాద్‌లో మొత్తం ఏడు మ్యాచ్‌లు జరగనుండగా.. ఈ ఏడు మ్యాచ్‌లు ఏప్రిల్ 1, 12, 16, 26, 30, మే 5, 12 తేదీల్లో జరుగుతాయి. ఇతర వేదికల్లో ఏప్రిల్ 4, 7, 19, 21, మే 3, 9, 15 తేదీల్లో సన్‌రైజర్స్ తమ మ్యాచ్‌లు ఆడనుంది.
ఐపిఎల్ 2020 షెడ్యూల్ వచ్చేసింది
RELATED ARTICLES