ముంబయి: చారిత్రక వాంఖడే స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి20 క్రికెట్ టోర్నమెంట్ 15వ సీజన్ శనివారం ఆరంభమైంది. తొలి మ్యచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో రన్నరప్ కోల్‌కతా నైట్ రైడర్స్ ఢీకొంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 74 మ్యాచ్‌లు జరుగుతా యి. లీగ్ దశలో 70,, ప్లే ఆఫ్‌లో 4 మ్యాచ్‌లు ఉంటాయి. 55 మ్యాచ్‌లకు ముంబయి వేదికకాగా, మిగతా 15 మ్యాచ్‌లకు పుణే ఆతిథ్యమిస్తుంది. ఆదివారం రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్ ఢీ కొంటాయి. రెండో పోరు పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉంటుంది. మే 29తో ముగిసే ఈ టోర్నమెంట్ గత ఏడాది కరోనా కారణంగా ప్రేక్షకులు లేకుండా, ఖాళీ స్టేడియాల్లో జరిగింది. ఈసారి 15 శాతం సీట్లను భర్తీ చేసుకునే అవకాశం కల్పించారు. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఆధ్వర్యం లో జరిగే ఈ టోర్నీ కోసం అధికారులు అన్నిరకాల బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఆటగాళ్లు, సహాయక సిబ్బందిని సేఫ్ బబుల్‌లో ఉంచారు.
ఐపిఎల్ షురూ…
RELATED ARTICLES