భారత యువ బ్యాట్స్‌మెన్ పృథ్వి షా
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడిన భారత యువ సంచలనం పృథ్వి షా ఈ సీజన్ ఐపిఎల్‌కు అందుబాటులో ఉంటానని చె ప్పాడు. 12వ సీజన్ ఐపిఎల్ మొదలయ్యే వరకు పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తానని 19 ఏళ్ల యువ క్రికెటర్ షా అన్నాడు. ఆస్ట్రేలియా ఎలెవన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో క్యాచ్ పట్టే క్రమంలో పృథ్విషా గాయపడిన విషయం తెలిసిందే. అనంతరం గాయం తీవ్రత ఎక్కువగా ఉండడం తో షా నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు దూరమయి భారత్‌కు వచ్చేశాడు. ఇప్పుడ గాయం నుంచి కోలుకుంటున్న షా త్వరలోనే ప్రాక్టీస్ మొదలు పెడుతానని చెబుతున్నాడు. ఐపిఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్ ప్రాంచైజీ పృథ్విషాను రిటైన్ పద్దతి ద్వారా సొంతం చేసుకుంది. షా టెస్టుల్లో అరంగేట్రంలోనే సంచలనం సృష్టించాడు. విండీస్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌తో టెస్టు కెరీర్‌ను ఆరంభించిన షా మూడు ఇన్నింగ్స్‌లలో 118.50 సగటుతో మొత్తం 237 పరుగులు చేశాడు.
ఐపిఎల్ వరకు ఫిట్‌నెస్ సాధిస్తా
RELATED ARTICLES