నిర్వాహణపై బిసిసిఐ తర్జనభర్జన
రద్దు తప్పదంటున్న క్రికెట్ నిపుణులు
అలా అయితే భారీగా నష్టపోన్ను బిసిసిఐ ప్రాంఛైజీలు
మంగళవారం జరగవలసిన సమావేశం వాయిదా!
ముంబయి : దేశంలో ప్రస్తుతం కరోనా విజృంభిస్తుండడంతో ఈ ఏడాది ఐపిఎల్ జరగడం దాదాపు అసాధ్యమే అని తేలిపోయింది. ఇక ఇప్పటివరకు 12 సీజన్లను సక్సెస్ ఫుల్ గా నిర్వహించుకుంటూ వచ్చిన బిసిసిఐ, ఐపిఎల్ పాలక మండలికి తాజాగా కరోనా భారీ షాక్ ఇచ్చింది. మార్చి 29 నుంచి ఐపిఎల్ 13వ సీజన్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కరోనా దేశంలోకి ఎంటర్ కావడంతో ఇప్పుడు సీజన్ మొత్తాన్ని రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో ఏకంగా 19 రాష్ట్రాలు మార్చి 31 వరకు లాక్ డౌన్‌ను విధించాయి. అత్యవసర పరిస్థితిల్లో తప్ప జనాలను బయటికి రానివ్వడం లేదు. దేశంలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే విదేశీయులను ఇప్పట్లో రానివ్వడం జరిగేపనేనా.. ఐపిఎల్‌లో మనవాళ్లతో పాటు విదేశీ ఆటగాళ్లు కూడా పాల్గొంటారని తెలిసిందే. దాంతో బిసిసిఐ.. ఐపిఎల్ 13 నిర్వహణ పై చేతులేత్తిసినట్లే కనిపిస్తుంది. ఇక ఇప్పటివరకు ప్రతి సీజన్‌కు ఆధాయంను పెంచుకుంటూ పోతున్న బిసిసిఐ అలాగే ఐపిఎల్ ప్రాంఛైజీలకు ఈ సారి ఐపిఎల్ రద్దయితే ఊహించని రీతిలో నష్టాలు రానున్నాయి. ఈ ఏడాది ఐపిఎల్ లేకుంటే బిసిసిఐ సుమారు 2000కోట్ల ఆదాయాన్ని కోల్పోనుంది అలాగే ప్రతి ఐపిఎల్ టీంకు 100కోట్ల మేర నష్టం కలుగనుంది. మొత్తానికి కరోనా ఊహించని రీతిలో దెబ్బ కొట్టింది.
సమావేశం వాయిదా..
కాగా, ఈ రోజు మరింత పెరిగింది. బిసిసిఐ అలాగే ఐపిఎల్ ప్రాంఛైజీ యజమానులతో షెడ్యూల్ ప్రకారం మంగళవారం జరగాల్సిన కాన్ఫరెన్స్ కాల్ సమావేశం వాయిదా పడింది. ఈ సమావేశంలో కరోనా మహమ్మారి మధ్య ఐపిఎల్ ముందుకు వెళ్ళే మార్గం గురించి చర్చించాల్సి ఉంది. మాకు మానవత్వం మొదట, మిగతావన్నీ రెండవ స్థానంలో ఉన్నాయి. మన దగ్గర పరిస్థితి ఇంకా మెరుగుపడలేదు కాబట్టి ఇప్పుడు ఐపిఎల్ గురించి మాట్లాడటంలో కూడా అర్థం లేదు. అందుకే నేను ఈ సమయంలో ఐపిఎల్ గురించి కూడా ఆలోచించలేను ప్రభుత్వం నిర్ణయాత్మక చర్యలు తీసుకుంది. కాని వారు తీసుకున్న చురుకైన చర్యలకు వారిని మెచ్చుకోవాలి. భారతదేశం అన్ని విమానాలను నిలిపివేసింది అని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని నెస్ వాడియా చెప్పారు. ఇలాంటి సమయంలో ఏదైనా చర్చించడంలో అర్థం లేదు. దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉంది. ఐపిఎల్ కంటే చాలా ముఖ్యమైన విషయాలను మేము పరిష్కరించుకోవాలి అని మరో ఫ్రాంచైజ్ యజమాని అన్నారు. అయితే ఏం జరుగుతుందో చూడాలి మరి.
మే నెలలోనైనా..
అయితే వచ్చే నెలాఖరు వరకూ పరిస్థితులు మెరుగైతే మే తొలి వారంలో లీగ్‌ను ఆరంభించాలని బీసీసీఐ భావిస్తోంది. కానీ ఇప్పుడున్న స్థితిలో ఐపీఎల్ భవితవ్యంపై ఏమీ చెప్పలేమని ఓ అధికారి వ్యాఖ్యానించాడు. ’లీగ్ విషయంలో వచ్చే నెలాఖరు వరకు వేచి చూడాలనుకుంటున్నాం. ఒకవేళ మే తొలి వారంలో కూడా నిర్వహించలేకపోతే ఇక ఈ ఏడాదికి ఆశలు వదులుకోవాల్సిందే. పరిస్థితులు అనుకూలిస్తే అప్పట్లో దక్షిణాఫ్రికాలో జరిపినట్టు 37 రోజుల్లో 59 మ్యాచ్‌లు ఆడిస్తాం. అయితే ఇలాంటి సందర్భంలో దేశమంతా పర్యటించలేం. మహారాష్ట్రలో ఉన్న నాలుగు స్టేడియాలను వినియోగించుకుంటే ప్రయాణ భారం తగ్గుతుంది. అయితే అన్నింటికన్నా ప్రజల ఆరోగ్య భద్రతే ముఖ్యం’ అని బోర్డు అధికారి స్పష్టం చేశారు.
ఐపిఎల్ ‘లాక్డౌన్’
RELATED ARTICLES