ముంబయి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2019 సీజన్ షెడ్యూల్‌ను బిసిసిఐ విడుదల చేసింది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కిం గ్స్‌తో ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. మార్చి 23, శనివారం సా యంత్రం చెన్నై వేదికగా తొలి ఈ మ్యాచ్ జరగనుంది. కేవలం రెండు వారాలకే షెడ్యూలను ప్రకటించడం గమనార్హం. మార్చి 23 నుంచి ఏప్రిల్ 5 వ రకు నిర్వహించే మ్యాచ్‌ల వివరాలే ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను అనుసరించి మిగతా మ్యాచ్‌ల నిర్వహణ వివరరాలు వెల్లడిస్తారని తెలుస్తోంది. రెండు వారాల వ్యవధిలో ఎ నిమిది వేదికల్లో 17 మ్యాచ్‌లు జరుగుతాయి. అన్ని జట్లు నాలుగు, ఢిల్లీ క్యా పిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐదు మ్యాచ్‌లు ఆడతాయి. రెండు సొంత మైదానం, రెండు ఇతర మైదానాల్లో ఉంటాయి. ఢిల్లీ మాత్రం మూడు సొంత మైదానంలో, బెంగళూరు మూడు ఇతర మైదానాల్లో ఆడనుంది.
ఐపిఎల్ రెండు వారాల షెడ్యూల్ విడుదల
RELATED ARTICLES