చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్
న్యూఢిల్లీ : ఇంగ్లాండ్ వేదికగా మే చివర్లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జ ట్టుపై ఐపిఎల్ ప్రభావం ఉండదని, దాని ఆధారంగా జట్టు ఎంపిక ఉండదని భారత సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేశారు. ఐపిఎల్‌లో ఆడుతున్న ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా జట్టు ఎంపిక ఉంటుందని వార్తలొస్తున్న నేపథ్యంలో స్వయంగా ఆయన స్పందించారు. ప్రపంచకప్ జట్టు ఎంపికకు ఐపిఎల్ ప్రామాణికం కాదని ఆయన తెలిపా రు. ఇప్పటికే భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్‌శర్మలు ఈ విషయంపై స్పందించిన విషయం తెలిసిందే. వారు కూడా ఐపిఎల్‌కు, ప్రపంచకప్ జట్టు ఎంపికకు ఎ లాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. తాజా గా వారి మాటలను సమర్థిస్తూ ఎమ్మెస్కే స్పష్టతనిస్తూ.. ఈ రెండు ఫార్మాట్లు వేరువేరని ఆ యన అన్నారు. టి20 మ్యాచ్ ప్రదనర్శన ఆ ధారంగా 50 ఓవర్ల మ్యాచ్‌కు ఆటగాళ్లను ఎంపిక చేయడమనేది సరైంది కాదని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని తెలిపారు. ఐపిఎల్‌కు వన్డేలకు చాలా తేడా ఉందన్నారు. ప్రపంచకప్ జట్టు కోసం ఐపిఎల్ కంటే ముందే ఎన్నో ప్రయోగాలు చేశామని, వాటి ఆధారంగానే జట్టు ఎంపిక ఉంటుందన్నారు. గత నాలుగేళ్లలో భారత ఆటగాళ్లు ఎన్నో వన్డేలతో పాటు బోలెడన్ని టి20లు ఆడారు. ప్రపంచకప్ జట్టు ఎంపికకు అది సరిపోతుందని, త్వరలోనే తాము కూడా వరల్డ్‌కప్ జట్టును ప్రకటించనున్నామని ఎమ్మెస్కే పేర్కొన్నారు.
ఐపిఎల్ ఆధారంగా ఎంపిక ఉండదు
RELATED ARTICLES