బిసిసిఐ వెల్లడి
ముంబయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) భారత టీ20 క్రికెట్ ముఖచిత్రాన్ని మార్చిన టోర్నీ. ఈ టోర్నమెంట్ ద్వారా ఎంతో మంది యువ క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో టీ20 లీగ్‌లు వచ్చినప్పటికీ.. ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ వేరు. ఇప్పటికే పన్నెండు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఐపీఎల్ వచ్చే ఏడాది 13వ సీజన్‌లోకి అడుగుపెట్టబోతోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కొత్తగా ‘పవర్ ప్లేయర్” అనే కొత్త కాన్సెఫ్ట్‌ను ఐపీఎల్ తదుపరి ఎడిషన్‌లో తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా చివరి ఓవర్‌లో మ్యాచ్‌ను గెలిపించగలడని భావించిన బౌలర్‌ను లేదా బ్యాట్స్‌మన్‌ను సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా బరిలోకి దింపేందుకు జట్టు మేనేజ్‌మెంట్‌కు అనుమతించబడుతుంది. ఈ అంశంపై ఇప్పటికే ఆమోదం లభించిందని ముంబైలోని బీసీసీఐ హెడ్‌క్వార్టర్స్‌లో మంగళవారం జరగనున్న ఐపీఎల్ పాలక మండలి సమావేశంలో చర్చించనున్నట్లు బిసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ‘తుది జట్టులో చోటు దక్కని ఆటగాడి విషయంలో పరీక్షించాలని చూస్తున్నాం‘ అని అన్నారు. ‘మ్యాచ్‌కి ముందు 15 మందిని ప్రకటిస్తారు. అయితే, ఒక ఆటగాడు తుది జట్టులో చోటు దక్కని మిగతా నలుగురిలో ఒక ఆటగాడు వికెట్ పడినప్పుడు లేదా ఓవర్ చివరిలో లేదా ఆట యొక్క ఏ సమయంలోనైనా సబ్‌స్టిట్యూట్ ఆటగాడిగా బరిలోకి దిగొచ్చు. మేము దీనిని ఐపీఎల్‌లో ప్రవేశపెట్టాలని చూస్తున్నాం… అంతకముందే, రాబోయే ముష్తాక్ అలీ ట్రోఫీలో ప్రవేశపెట్టాలని అనుకుంటున్నాం‘ అని తెలిపారు. వాస్తవానికి ఈ ఆలోచన ఆటను ఎలా మారుస్తుందో కూడా ఆయన వివరించారు. ‘ఉదాహరణకు చివరి ఆరు బంతుల్లో జట్టు విజయానికి 20 పరుగులు అవసరమని అనుకోండి. హిట్టర్‌గా పేరొందిన ఆండ్రూ రస్సెల్ డగౌట్‌లో కూర్చుని ఉన్నాడు. అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు. అయితే, ‘పవర్ ప్లేయర్” కాన్సెఫ్‌ో్ట్ల అతడు బ్యాటింగ్ దిగొచ్చు. జట్టుని కూడా గెలిపించొచ్చు‘ అని అన్నాడు. ‘అలాగే, చివరి ఓవర్‌లో మీరు ఆరు పరుగులను కట్టడి చేయాల్సి ఉందనుకోండి. జస్ప్రీత్ బుమ్రా లాంటి డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ డగౌట్‌లో కూర్చుని ఉన్నాడు. అప్పుడు కెప్టెన్ ఏం చేస్తాడంటే? 19వ ఓవర్ పూర్తున వెంటనే బంతిని బుమ్రా చేతికిస్తాడు. ఈ ‘పవర్ ప్లేయర్” కాన్సెఫ్ట్‌కు ఆట సామర్థ్యాన్ని మార్చ కలిగే శక్తి ఉంది‘ అని బీసీసీఐ ఉన్నతాధికారి తెలిపారు.
ఐపిఎల్‌లో కొత్తగా ‘పవర్ ప్లేయర్’
RELATED ARTICLES