బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ
అహ్మదాబాద్: ఐపిఎల్ 13వ సీజన్ గురించి యావత్ క్రికెట్ లోకం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంది. అయితే ఈసారి ఐపిఎల్ నిర్వహణలో కీలక మార్పులు ఉండనున్నాయంటూ.. గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. మ్యాచ్‌ల సమయంలోనూ మార్పులు ఉంటాయని సోషల్‌మీడియాలో కోకొల్లలుగా వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ఈ వార్తలన్నింటికీ.. బిసిసిఐ సోమవారం చెక్ పెట్టింది. ఈ ఏడాది కేవలం ఐదు డబుల్ హెడర్స్ మ్యాచ్‌లు మాత్రమే ఉంటాయని, ఆ తర్వాత మ్యాచ్ ఆరంభం సమయంలో ఎటువంటి మార్పులు ఉండవని బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. అంతేకాక, ఈసారి ఫైనల్ మ్యాచ్ ముంబయిలో జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా ఇప్పటివరకూ జరిగిన ఐపిఎల్‌లో ప్రతీ వారంతంలో డబుల్ హెడర్స్ మ్యాచ్‌లు జరిగేవి. ఇందులో ఒకటి సాయంత్రం నాలుగు గంటకు ప్రారంభంకాగా, మరొకటి రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభం అయ్యేది. దీంతో ఐపిఎల్ కౌన్సిల్ ఒకే రోజు రెండు మ్యాచుల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సి వచ్చేది. ఎటువంటి తప్పిదాలు జరుగకుండా.. అభిమానులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా.. ఇప్పటివరకూ మ్యాచులు నిర్వహిస్తూ వచ్చింది. అయితే ఐపిఎల్ కౌన్సిల్‌కి దీని వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని.. అందుకే ఈ సీజన్ నుంచి ఈ మ్యాచ్‌లను పూర్తిగా రద్దు చేస్తున్నారని పుకార్లు వచ్చాయి. అంతేకాక.. ప్రతీసారి రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభం అయ్యే మ్యాచ్‌లు ఈ సారి 7.30 గంటలకే ప్రారంభం అవుతాయనే వార్తలు కూడా పుట్టుకొచ్చాయి. కానీ, సోమవారం గంగూలీ చేసిన ప్రకటనతో ఈ వార్తలకు చెక్ పడింది. అహ్మదాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో గంగూలీ మాట్లాడుతూ.. “ఐపీఎల్ మ్యాచ్ ఆరంభ సమయంలో ఎటువంటి మార్పులు లేవు. 7.30కి మ్యాచ్ ఆరంభం అవుతుందనే చర్చ జరిగింది. కానీ, అది అవాస్తవం. ఈ సారి కేవలం 5 డబుల్ హెడర్స్ మ్యాచులు ఉంటాయి. అంతేకాక.. ఈ సీజన్ ఫైనల్ ముంబయి వేదికగా జరుగనుంది.
ఐదే డబుల్ హెడర్స్ మ్యాచ్‌లు

RELATED ARTICLES