కేరళ సిఎం పినరయ్ విజయన్
తిరువనంతపురం : పేదరికాన్ని నిర్మూలించేంత వరకు యాచించడాన్ని నిషేధించలేమని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ హర్షం వ్యక్తంచేశారు. రానున్న ఐదేళ్లలో కేరళలో తమ ప్రభుత్వం పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఏ ఒక్కరు కూడా భిక్షగాళ్లుగా మారరని, పేదరికం, ఆకలి వారిని ఆ విధంగా మారుతుందని విజయన్ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు అతిపెద్ద సామాజిక ఆర్థిక సమస్యకు సంబంధించి మానవతా దృక్పథాన్ని ప్రతిబింబిస్తుందని సిఎం చెప్పారు. యాచించడానికి గల అనేక కారణాల్లో పేదరికం కూడా ఒకటని పేర్కొంటూ నిషేధం ద్వారా దానిని నిర్మూలించలేమన్నారు. అటుంటి దృక్పథం మారాలని, సమాజం సానుభూతిని చూపించాలని, పేదల ప్రజలకు సహాయం చేసేందుకు సముఖత వ్యక్తం చేయాలని సూచించారు. అదృష్టవంతులు మద్దతు ఇస్తేనే యాచనలేని ప్రపంచం సాధ్యమవుతుందన్నారు. అప్పుడే వారికి పేదరికం నుంచి విముక్తి కలుగుతుందని, అది నెరవేరడం అంత సులువు కాదని విజయన్ అన్నారు. భూ విధానం మారాలని, దానిని సమర్థవంతంగా అమలు చేయాలని సుప్రీంకోర్టు కోరిందన్నారు. ఈ దిశలో మొదటి అడుగగా తీవ్రమైన పేదరికాన్ని నిర్మూలించేందుకు కేరళ కొత్త ప్రాజెక్టును ప్రారంభించిందని సిఎం చెప్పారు. అందులో భాగంగా సర్వే నిర్వహిస్తున్నామన్నారు. నాలుగు నెలల్లో దీనిని పూర్తి చేస్తామని చెప్పారు. ఆ తరువాత స్థానిక స్వయం ప్రభుత్వ సంస్థలు రక్షణ కింద సూక్ష్మ ప్రణాలికలను సిద్ధం చేస్తామని, తీవ్ర పేదరికంలో మగ్గుతున్న కుటుంబాలకు విముక్తి కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ఐదేళ్లలో వ్యవధిలో పేదరికాన్ని నిర్మూలిస్తాం
RELATED ARTICLES