బుధవారం పలు చోట్ల విస్తారంగా కురిసిన వానలు
బోధన్‌లో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
సాధారణ స్థితిలో వ్యాపించిన నైరుతి రుతుపవనాలు
ప్రజాపక్షం / హైదరాబాద్ : రాగల ఐదు రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవణాలు సాధారణంగా వ్యాపించాయి. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీ దుగా ఝార్ఖండ్, మధ్యప్రదేశ్‌వైపు పయనిస్తోంది. దీని ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురువ నున్నాయి. బుధవారం రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు, కొన్ని చోట్ల విస్తారంగా వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, కొత్తగూడెం, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. నిజామాబాద్ జిల్లా బోదన్‌లో 13 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదే జిల్లా యెదపల్లిలో ఎనిమిది సెంటిమీటర్లు, నిజామాబాద్‌లో ఏడు, బీంగల్‌లో ఐదు, మనుగూరు, కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లా తాంషి, సిర్పూర్, హుస్నాబాద్, డిచ్‌పల్లి, దర్‌పల్లి, తిమ్మాపూర్, బెజ్జం కి, జక్కంపల్లిలలో నాలుగేసి సెంటిమీటర్ల చొప్పున వర్షం కురిసింది. వేములవాడ, ఆదిలాబాద్, గాంధారి, సిరిసిల్ల, పరకాల, బిక్‌నూర్, అశ్వారావ్‌పేటలలో మూడేసి సెంటిమీటర్ల వర్షపాతం నమోదయింది.