HomeOpinionArticlesఐదు రాష్ట్రాల్లో కీలకమైన ఎన్నికలు

ఐదు రాష్ట్రాల్లో కీలకమైన ఎన్నికలు

రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ మిజోరం, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మధ్యప్రదేశ్, చత్తీస్ రాష్ట్రాల్లో బిజెపి గత 15 సంవత్సరాలుగా అధికారంలో ఉంది. అందువల్ల అది ప్రభుత్వ వ్యతిరేకత భావనను ఎదుర్కోవటమేగాక, రెండు రాష్ట్రాల ముఖ్య మంత్రులు తీవ్రమైన అవినీతి ఆరోపణలకు గురైనారు. మధ్య ప్రదేశ్ వ్యాపం, చత్తీస్ రేషన్ కుంభకోణం బిజెపి తరహా అవినీతికి చక్కటి ఉదాహరణలు. వ్యాపం కేసులో అనేకమంది నిందితులు, సాక్షులు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. బిజెపి తమకు కంచుకోటలు గా పరిగణించిన ఈ రెండు ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పుడు మూల్యం చెల్లించుకోక తప్పదు. తమ చెప్పు చేతల్లోని టీవీ ఛానల్స్ ఎన్నికల పూర్వ సర్వేలు కూడా బిజెపి ఓటమి తప్పదంటున్నాయి.
ప్రతి ఎన్నికల్లో పాలకపార్టీ మారుతుండే సాంప్ర దాయం రాజస్థాన్ ఈ పర్యాయం ఈ లక్షణాన్ని నిరోధించాలని బిజెపి ప్రయత్నిస్తోంది. అది అధికారం చేబట్టిన రోజునుంచీ రాష్ట్రంలో మత, కుల విభజన క్రమాన్ని వేగిరపరచటంపై కేంద్రీక రించింది. గత ఐదేళ్లలో మూకహత్యలు, గోరక్షణ పేరుతో హత్యలు, దళితులు, ఆదివాసీలపై ముఖ్యం గా స్త్రీలపై గరిష్టంగా దాడులు జరిగిన రాష్ట్రం ఇదే. రాష్ట్ర ప్రభుత్వం లజ్జారహితంగా మతోన్మాద, కులోన్మాద క్రిమినల్స్ కాపాడేటట్లు పోలీసుపై ఒత్తిడి చేయట మేగాక వాస్తవాలను వక్రీకరించి బాధితులను అసలు నేరస్థులుగా నిందించేటట్లు చేస్తున్నది.
ఆర్ బ్రాండ్ ప్రచారం, ఎత్తుగడలకు రాజస్థాన్ మచ్చుతునక. సంఘ్ కుల, మత కలహాలను, హింసా కృత్యాలను నిర్వహించటమే గాక నిందను బాధితులపై మోపటానికి అధికారా న్ని దుర్వినియోగం చేస్తున్నది. రాజస్థాన్ లో ఎన్నికల క్రమాన్ని సీరియస్ గమనించాల్సి ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజాగ్రహాన్ని ఎదుర్కొం టున్నందున వచ్చే లోక్ ఎన్నికల్లో ఆర్ బిజెపిలు కుల, మత విభజనను ప్రధాన ఆయుధం గా ఉపయోగించనున్నాయి. మిజోరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాగా తెలంగాణలో కెసిఆర్ లోక్ ఎన్నికలను తప్పించేనిమిత్తం 9 మాసాలు ముందుగా అసెంబ్లీని రద్దు జూదాన్ని ఎంచుకున్నారు.
అవసరమైతే 2019 ఎన్నికల్లో లేదా ఎన్నికల అనంతరం బిజెపితో చేతులు కలిపే అవకాశాన్ని ఆయన అట్టి పెట్టు కున్నారు. అందువల్ల అతన్ని ఓడించాలి. పాలకపార్టీని ఓడించ టానికై కాంగ్రెస్, సిపిఐ, తెలుగుదేశం, జనసమితి ఒకే వేదికమీదకు రావటం ఆహ్వానించ దగింది.
వామపక్షాలకు సంబంధించినంతవరకు ఈ ఐదు రాష్ట్రాల్లో వాటికి చెప్పుకోదగ్గ బలంలేదు. తెలంగాణ, చత్తీస్ రాజస్థాన్ కొన్ని బలమైన కేంద్రాలున్నాయి. ఒక రాష్ట్రంలో ఒక పార్టీకి గల పట్టుపై భిన్నాభిప్రాయాలుండవచ్చు. కాని యావ ద్దేశానికీ ఒకే ఎన్నికల ఎత్తుగడలు ఉండజాలవని వామపక్ష పార్టీలన్నీ ఉమ్మడి నిర్ధారణకు వస్తు న్నాయి. ఈ విషయాన్ని సిపిఐ గత దశాబ్దకాలంగా చెబుతున్నది. కొల్లాంలో జరిగిన పార్టీ 23వ జాతీయ మహాసభ రాజకీయ తీర్మానం ఇలా పునరుద్ఘాటించిందిః
“ఎన్నికల ఎత్తుగడలకు సంబంధించి, బిజెపిని అధికారంనుండి తొలగించటం సర్వసామాన్య లక్షంగా ఉన్నప్పటికీ యావద్దేశా నికీ ఒకే ఎత్తుగడలు ఉండజాలవని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎన్నికలను పార్టీ ఎదుర్కొన్నప్పుడు ఎన్నికల ఎత్తుగడలు రూపొం దించుకోవాలి.
రాష్ట్రాల్లో, సంబంధిత రాష్ట్రంలోని వస్తుగత రాజకీయ పరిస్థితిని, అక్కడి రాజకీయ శక్తుల పొందికను ఎన్నికల ఎత్తు గడలు పరిగణనలోకి తీసుకోవాలి. ఏ బూర్జువావర్గ లౌకిక పార్టీని మినహా యించవలసిన పనిలేదు. వామపక్ష, ప్రజాతంత్ర ప్రత్యామ్నాయం నిర్మించే దిశగా మన ప్రయాణాన్ని ముందుకు గొని పోవటంతోపాటు, ఎన్నికలు జరుగుతున్న శాసనసభలో పార్టీకి తగు ప్రాతినిధ్యం సంపాదించేవిగా ఎన్నికల ఎత్తుగడలు ఉండాలి.”
(న్యూఏజ్, నుంచి)

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments