ప్రజాపక్షం/హైదరాబాద్: రాష్ట్ర సమాచార కమిషనర్లుగా ఐదుగురిని గవర్నర్ నియమించారు. ‘నమస్తే తెలంగాణ’ సంపాదకులు కట్టా శేఖర్‌రెడ్డి, టి న్యూస్ సిఇఒ మైదా నారాయణరెడ్డి, గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, సేవాలాల్ మహారాజ్ యువసేన అధ్యక్షులు గుగులోత్ శంకర్‌నాయక్, న్యాయవాది సయ్యద్ ఖలీలుల్లా, న్యాయవాది డాక్టర్ ఎండి అమీర్ అలియాస్ మహ్మద్ అమీర్ హుసేన్‌లు సమాచార కమిషనర్‌లుగా నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ప్రస్తుతం ఇద్దరు సమాచార కమిషనర్లు ఉండగా తాజాగా ప్రభు త్వం ఐదుగురిని నియమించడంతో మొత్తం ఏడుగురు కమిషనర్లు ఉన్నారు. వీరు ఈ పదవిలో మూడు సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కొనసాగనున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చైర్మన్‌గా ఉన్న సమాచార కమిషనర్ల ఎంపిక కమిటీ ఆదివారం ప్రగతిభవన్‌లో సమావేశమైంది. సిఎం కెసిఆర్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కమిటీ సభ్యులుగా ఉన్న శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ పాల్గొని, దరఖాస్తులను పరిశీలించి ఐదుగురి పేర్లను గవర్నర్‌కు సిఫారసు చేశారు. ఎంపిక కమిటీ సిఫార్సుకు అనుగుణంగా గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఐదుగురిని కమిషనర్లుగా నియమించారు.
కమిషనర్‌ల నేపథ్యమిదీ..
కట్టా శేఖర్‌రెడ్డి: నల్లగొండ జిల్లా మాడుగులపల్లికి చెందిన కట్టా శేఖర్‌రెడ్డి 30 సంవత్సరాలుగా పైగా జర్నలిజం వృత్తిలో ఉన్నారు. ఉదయం, ఆంధ్రజ్యోతి, వార్త, మహాటివిలో వివిధ హోదాలలో పనిచేశారు. ప్రస్తుతం నమస్తే తెలంగాణ దినపత్రిక సంపాదకునిగా పనిచేస్తున్నారు.
ఐదుగురు సమాచార కమిషనర్లు
RELATED ARTICLES