ఛత్తీస్‌గఢ్ నారాయణ్‌పూర్ జిల్లాలో ఎదురుకాల్పులు
ఇద్దరు జవాన్లకు గాయాలు
ఘటనాస్థలి వద్ద భారీగా మందుగుండు సామగ్రి లభ్యం
భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణ్‌పూర్ జిల్లాలో డిఆర్‌జి బలగాలు,- మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఇద్దరు డిఆర్‌జి జవాన్లు గాయాలయ్యాయి. నారాయణ్‌పూర్ జిల్లాలోని ఓర్చా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న దూల్‌బేడా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు అడవి బాట పట్టిన డిఆర్‌జి జవాన్లకు శనివారం ఉదయం 6 గంటల సమయంలో మావోయిస్టులు తారసపడ్డారు. డిఆర్‌జి బలగాల రాకను కనిపెట్టిన మావోయిస్టులు ఒక్కసారిగా బలగాలపై విరుచుకు పడుతూ కాల్పులు ప్రారంభించారు. అయితే లొంగిపోవాలని ఎన్ని సార్లు చెప్పినప్పటికీ కాల్పులు మరింత ఉధృతం చేస్తుండటంతో ఆత్మరక్షణ కోసం డిఆర్‌జి బలగాలు సైతం ఎదురు కాల్పులకు దిగాయి. సుమారు గంటపాటు ఇరు వర్గాల మధ్య హోరా హోరీ కాల్పులు చోటు చేసుకున్నాయి. పోలీసుల తూటాలకు బుదులివ్వలేక పోయిన మావోయిస్టులు క్రమంగా అడవుల్లోనికి జారుకున్నట్లు డిజిపి డిఎం అవస్థీ వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందగా,ఇద్దరు డిఆర్‌జి జవాన్లకు సై తం తూటా గాయాలు అయినట్లు స్పష్టం చేశా రు. ఘటనా స్థలంలో తుపాకులతో పాటు భారీగా మందుగుండు సామాగ్రి లభ్యమైంది. అడవుల్లోని కి పారిపోయిన మావోయిస్టుల కోసం బలగాలు మరింత ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి.
ఐదుగురు నక్సల్స్ హతం
RELATED ARTICLES