ప్రజాపక్షం / హైదరాబాద్ : ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న కరోనా ఇప్పుడు హైదరాబాద్ ఐటి కారిడాన్‌ను వణికిస్తోంది. ఇక్కడి ఐటి క ంపెనీలో ఒక మహిళా ఉద్యోగినికి కరోనా సోకినట్లు పుకార్లు షికారు చేయడంతో ఒక్క సారిగా అలజడి రేగింది. రెండు రోజుల క్రితం ఒకే ఒక్క పాజిటివ్ కేసు మాత్రమే నమోదైందని వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ధృవీకరించిన మరుసటి రోజే మరో రెండు కేసులు అనుమానాస్పదంగా ఉన్నాయంటూ వారి షాంపిల్స్‌ను పుణెకు పంపించినట్లు చెప్పడంతో ఇప్పుడు హైదరాబాద్ వాసులు బిక్కుబిక్కు మంటున్నారు. కరోనా వ్యాధికి మందు కనుగోనేందుకు మరో ఏడాది పట్టవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలోనే కాదు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోనూ 11 అనుమానిత కేసులు నమోదుకాగా, దేశంలో 28 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు ధ్రువీకరించాయి. కరోనా రోగులు పెరుగుతున్న క్రమంలో సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ అవుతోంది. ఎలక్ట్రానిక్ ప్రసార మాధ్యమాల్లోనూ కరోనాపై అలర్ట్‌గా ఉండాలంటూ రోజంతా వార్తా బులిటిన్‌లు, చర్చా గోష్టులు నిర్వహించడం గమనార్హం. దేశంలోనే తొలి సారిగా కరోనా కేసు హైదరాబాద్‌ది కాగా, రెండో కేసు ఢిల్లీలో నమోదైంది. కరోనా వ్యాధిని తేలిగ్గా తీసుకోవద్దంటూ ప్రభుత్వానికి వినతులు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్‌లో నమోదైన తొలి కేసు సికింద్రాబాద్ మహింద్రాహిల్స్‌కు చెందిన 24 ఏళ్ల ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ది కావడం ఇందుకు గమనార్హం. బుధవారం గచ్చిబౌలి మౌండ్‌స్పేస్ వద్ద గల ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి కరోనా పాజిటివ్ లక్ష్యణాలు ఉన్నట్లు పుకార్లు షికారు చేశాయి. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి పిడేలు వాయిస్తున్న చందంగా అన్న దురభిప్రాయం రాకుండా ఉండాలన్న భావనతో కరోనా వ్యాధి పట్ల ప్రభుత్వం అప్రమత్తం అయినట్లు కనిపించింది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కోఠిలోని వైద్య విధాన పరిషత్‌లో మీడియా సమావేశం నిర్వహించి బుధవారం నాడు కూడా కొత్తగా 20 అనుమానిత కేసులు నమోదయ్యాయని, దీనిపై ఆందోళన అవసరం లేదంటూ తెలిపారు. ఐటి కారిడార్‌లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి. సజ్జనార్‌తో కలిసి ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ మీడియా సమావేశం నిర్వహించి ఐటి ఉద్యోగులు, కంపెనీల పేర్లు మీడి యా ప్రచారం చేయవద్దంటూ విన్నవించారు. ఎవరికి వచ్చింది లేనిదీ నిర్ధారణ అయ్యాక చెబుతామని అప్పటి వరకు ఆయా ఉద్యోగుల పేర్లు, వారి ఇళ్ల ముందు ప్రత్యక్ష ప్రసార మీడియా వాహనాలను ఉంచవద్దంటూ విజ్ఞ ప్తి చేశారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరులు అభివృద్ధి కేంద్రంలో మంత్రి కెటిఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఐటి కారిడార్‌లో కలకలం
RELATED ARTICLES