మంత్రులు తమ అధికార నివాసాల్లోనే ప్రజలకు అందుబాటులో ఉండాలి
సిఎం కెసిఆర్ ఆదేశం
హైదరాబాద్ : కొత్త సచివాలయం సమీకృత భవన నిర్మాణ నేపథ్యంలో మంత్రులు తమ అధికార నివాసంలోనే ప్రజలకు అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించినట్లు తెలిసింది. ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించినట్లు సమాచారం. మంత్రులంతా రోడ్ నెంబర్ 12లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో విధిగా నివాసముంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించినట్లు తెలిసింది. దీంతో మంత్రులు హుటాహుటిన మినిస్టర్స్ క్వార్టర్స్‌కు తరలుతున్నారు. కాగా హైదరాబాద్, సికింద్రాబాద్ మంత్రులకు మినహాయింపు కల్పించారు.మంత్రులకు సంబంధించి శాఖాపరమైన కార్యాలయాలు కూడా దాదా పు ఖరారు చేశారు.వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
ఏ మంత్రి ఎక్కడ?
1. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు :
హెచ్‌ఎంఆర్‌ఎల్, రసూల్ పురా, బేగంపేట్.
2. హోం శాఖ మంత్రిమహమూద్ అలీ : – ఎపి డిజిపి కార్యాలయం, లక్డీకాపూల్.
3. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల
రాజేందర్ – : బిఆర్‌కె భవన్.
4. దేవాదాయ శాఖ మంత్రి ఎ.ఇంద్ర కరణ్ రెడ్డి – : ఎండోమెంట్ కార్యాలయం, బోగ్గులకుంట, అబిడ్స్.
5. ఎస్.సి.సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్: -సంక్షేమ భవన్.
6. పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు -: రంగారెడ్డి జడ్‌పి కార్యాలయం,
ఖైరతాబాద్.
7. విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి : – టిఎస్‌ఎస్‌పిడిసిఎల్, మింట్ కాంపౌండ్.
8. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి
నిరంజన్ రెడ్డి – : హాకా భవనం, లక్డీకాపూల్.
9. ఆబ్కారీ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్:
రవీంద్ర భారతి, లక్డీకాపూల్.
10. పశుసంవర్ధక శాఖ మంత్రి టి
శ్రీనివాస్ యాదవ్ – : బిఆర్‌కె. భవన్.
11. ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి
కె.టి.రామారావు – : మునిసిపల్ కాంప్లెక్స్, ఎసి గార్డ్, మాసబ్ టాంక్.
12. ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు : – అరణ్య భవన్, లక్డీకాపూల్.
13. గిరిజన సంక్షేమమంత్రి సత్యవతి రాథోడ్: – సంక్షేమ భవన్.
14. బిసి సంక్షేమ మంత్రి గంగుల కమలాకర్: – బిసి కమిషన్, ఖైరతాబాద్.
15. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ : -రీజనల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్, ఖైరతాబాద్.
16. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి: – ఎస్‌సిఈఆర్‌టి , బషీర్ బాగ్.
17. రహదారులు భవనాల మంత్రి
వి.ప్రశాంత్ రెడ్డి – : ఇఎన్‌సి, ఎర్రమంజిల్.
18. కార్మికమంత్రి సి.హెచ్. మల్లారెడ్డి: మహిళా శిశు సంక్షేమ భవన్, రోడ్ నెంబర్: 45, జూబ్లీహిల్స్.
ఏ మంత్రి ఎక్కడ?
RELATED ARTICLES