కాంగ్రెస్‌లో చేరిన షర్మిల
న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిల గురువారం కాంగ్రెస్‌లో చేరారు. తన వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినట్టు ప్రకటించారు. తనకు ఏ బాధ్యత అప్పగించినా నెరవేరుస్తానని ఆమె చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. రాహుల్‌ను దేశ ప్రధానిగా చూడాలన్నది తన తండ్రి కలిగా ఆమె పేర్కొన్నారు. దానిని సాకారం చేయడంలో తాను కూడా భాగస్వామిని కాబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. దేశంలోనే అతిపెద్ద, అత్యంత లౌకిక‘ సిద్ధాంతాలు ఉన్న పార్టీగా కాంగ్రెస్‌ను ఆమె అభివర్ణించారు. కాంగ్రెస్ అన్ని వర్గాలకు మెరుగైన సేవలు అందిస్తున్నదని, ప్రజలను ఏకం చేసున్నదని అన్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు. తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తెలుగు ప్రజల లెజెండరీ లీడర్‌గా పేర్కొన్న షర్మిల, ఆయన మాదిరిగానే తాను కూడా జీవితాంతం కాంగ్రెస్‌కు సేవ చేస్తానని ప్రకటించారు. భారతదేశ నిజమైన సంస్కృతిని నిలబెట్టిన ఘనత కాంగ్రెస్‌కు మాత్రమే దక్కుతుందని చెప్పారు. రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రతో ప్రజల విశ్వాసాన్ని పొందినందుకే, కర్ణాటకలో పార్టీ విజయం సాధించిందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయంలో తాను భాగమైనందుకు సంతోషంగా ఉందని షర్మిల అన్నారు. కెసిఆర్ నేతృత్వంలోని బిఆర్ఎస్ అవినీతి, ప్రజా వ్యతిరేక పాలనను అంతమొందించేందుకు తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. కెసిఆర్ వ్యతిరేక ఓటును చీల్చడం తమకు ఇష్టం లేదని, ఆ కారణంగానే ఎన్నికల్లో పోటీ చేయలేదని వివరించారు.
ఏ బాధ్యత ఇచ్చినా స్వీకరిస్తా
RELATED ARTICLES