10 రోజుల్లో లెక్కలు తేల్చండి
అధికారులకు సిఎం కెసిఆర్ ఆదేశం
రాష్ట్రంలో మార్కెటింగ్ వ్యవస్థకు మరింత ఊపు తెస్తామని ప్రకటన
ప్రజాపక్షం / హైదరాబాద్ కేంద్రం తెచ్చిన కొత్త చట్టాల ఫలితంగా దేశవ్యాప్తంగా మార్కెటింగ్ వ్యవస్థ ఎలా పరిణామం చెందినప్పటికీ, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం సజీవంగా ఉంచడమే కాకుండా మరింత బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. పది రోజుల్లోగా రాష్ట్రంలోని ఏ గుంటలో ఏ పంట వేశారనే విషయంలో సరైన లెక్కలు తీయాలని కెసిఆర్ చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన రైతు వేదికలను వెనువెంటనే వాడుకలోకి తేవాలని, రైతులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రైతులు పండించిన పంటలను మార్కెట్లో అమ్ముకునేందుకు సరైన పద్ధతులు అవలంబించే బాధ్యత మార్కెటింగ్ శాఖపై ఉందన్నారు. ఏ పంటకు ఎక్కడ మంచి ధర ఉందనే విషయంలో రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు చేయాలి. ఇందుకోసం మార్కెటింగ్ శాఖలో రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్‌ను ఏర్పా టు చేయాలని, తెలంగాణ రాష్ట్రంలో మార్కెటింగ్ శాఖ ను మరింత బలోపేతం చేసుకోవాలని, కొత్త చట్టాల అమలు వల్ల మార్కెట్ సెస్ రాకున్నా ప్రభుత్వమే నిధులను సమకూర్చి మార్కెటింగ్ శాఖను బలోపేతం చేస్తామన్నారు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం బాగా పెరిగిన నేపథ్యంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల ప్రాధాన్యం, బాధ్యత ఎంతో పెరిగిందని, వ్యవసాయ శాఖ కాగితం , కలం శాఖగా కాకుండా పొలం,- హలం శాఖగా మారాలని, ఈ రెండు శాఖల పనితీరులో గుణాత్మక, గణనీయమైన మార్పు రావాలన్నారు. వ్యవసాయంలో పంటల మార్పిడీ విధానం, యాంత్రీకరణ, ఆధునిక సాగు పద్ధతులు పెంపొందించేందుకు వ్యవసాయ శాఖ తీవ్రంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. ఎఇఒ, రైతు బంధు సమితి కార్యాలయాలు కూడా రైతువేదికలోనే భాగంగా ఉండాలని, ఇందుకు అవసరమైన ఫర్నీచర్, ఇతర వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రగతిభవన్‌లో ఆదివారం జిల్లా స్థాయి వ్యవసాయాధికారులు, మార్కెటింగ్ శాఖాధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. అన్ని జిల్లాలకు చెందిన అధికారుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. వ్యవసాయాభివృద్ధి, రైతు సంక్షేమం విషయంలో ఈ రెండు శాఖలు నిర్వహించాల్సిన బాధ్యతలను ముఖ్యమంత్రి చెప్పారు. దాదాపు 8 గంటల పాటు జరిగిన సమావేశంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, ఎంపి కె.కేశవరావు, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, సివిల్ సప్లయిస్ కార్పోరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ చైర్మన్ మారం గంగారెడ్డి, సిఎంఒ అధికారులు స్మితా సభర్వాల్, భూపాల్ రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, సివిల్ సప్లయిస్ కమిషనర్ అనిల్ కుమార్, డైరెక్టర్ లక్ష్మీబాయి, సీడ్స్ కార్పోరేషన్ ఎండి కేశవులు తదితరులు పాల్గొన్నారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలియజేసింది. సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏడాదికి 4 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసే గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ రూపాంతరం చెందుతున్నదని, ఈ పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ ఎంతో బలోపేతం కవాలని, వ్యవసాయాధికారులు అడుగడుగునా రైతులకు అండగా నిలవాలి అని ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపునిచ్చారు.
ఒకే పంట వేసే విధానం పోవాలి
రైతులు ఎప్పుడూ ఒకే పంట వేసే విధానం పోవాలని, పంట మార్పిడీ విధానం రావాలని, పంట మార్పిడీ వల్ల ఉత్పత్తి పెరిగి లాభాలు వస్తాయని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. గ్రామాల్లో కూలీల కొరత ఉందని, వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగాల్సి ఉందని, పంటల సాగు విధానంలో ఆధునిక పద్ధతులు రావాలని, ఈ అంశాలపై రైతులకు వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2600 క్లస్టర్లలో నిర్మించిన రైతు వేదికలను వెంటనే వినియోగంలోకి తీసుకువచ్చి రైతులతో సమావేశాలు నిర్వహించాలని, పంటల సాగు, పంటల మార్పిడీ, యాంత్రీకరణ, ఆధునిక సాగు పద్ధతులు, మార్కెటింగ్ తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు.
సమావేశంలో ముఖ్యమంత్రి అధికారులకు ఇచ్చిన ఆదేశాలు :
* అన్ని రైతు వేదికలను వెంటనే ఉపయోగంలోకి తేవాలి. ఎఇఒ, రైతుబంధు సమితి కార్యాలయాలను రైతువేదికల్లోనే ఏర్పాటు చేయాలి. రైతు వేదికలకు మిషన్ భగీరథ ద్వారా మంచినీరు సరఫరా చేయాలి. మైక్ సెట్ సమకూర్చాలి. ఫర్నీచర్ ఏర్పాటు చేయాలి. ఏ క్లస్టర్లో అయినా ఏ కారణం చేతనైనా ఎఇఒ పోస్టు ఖాళీయైన, ఎవరైనా దీర్ఘకాలిక సెలవు పై వెళ్ళినా తాత్కాలిక పద్ధతిలో మరొకరిని నియమించాలి.
* రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి వ్యవసాయ మార్కెట్లే వేదిక. తెలంగాణ రాష్ట్రంలో వాటిని కొనసాగిస్తాం. రైతులు ఓ పద్ధతి ప్రకారం వచ్చి మార్కెట్లో పంటలు అమ్ముకునే విధానం తీసుకురావాలి. ఏ గ్రామానికి చెందిన రైతులు ఏ రోజు మార్కెట్ కు రావాలో నిర్ణయించి టోకెన్లు జారీ చేయాలి.
* రాష్ట్రంలో మార్కెట్ల వారీగా ఎంత ధాన్యం వస్తున్నది, అక్కడి వ్యాపారులకు ఎంతవరకు కొనుగోలు శక్తి ఉన్నది అనే వివరాలు సేకరించాలి. వరిలో ఆధునిక సాగు పద్ధతులు వచ్చాయి. వెదజల్లే పద్ధతి ద్వారా సాగు చేయడం వల్ల ఎకరానికి 10 వేల రూపాయల వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది. పత్తిలో సింగిల్ పిక్ పద్ధతి వచ్చింది. ఇంకా అనేక పంటల్లో కొత్త వంగడాలు, కొత్త పద్ధతులు వచ్చాయి. వాటి పై రైతులకు అవగాహన కల్పించాలి.
* యాంత్రీకరణ పెంచడం కోసం ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తుంది.
* మండల వ్యవసాయాధికారులను ఆగ్రానమిస్టులుగా మార్చడానికి నిరంతరం శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి.
* ఆధునిక సాగు పద్ధతులను అధ్యయనం చేయడానికి వ్యవసాయాధికారులు ఇజ్రాయిల్ పర్యటించాలి.
* పప్పుదినుసులు, నూనె గింజల సాగును ప్రోత్సహించాలి. పప్పులు, నూనె గింజలు పండించే ప్రాంతాల్లో దాల్ మిల్లులు, ఆయిల్ మిల్లులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చొరవ చూపుతుంది.
* ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలి. ఇందుకోసం స్ట్రాటజిక్ పాయింట్లను గుర్తించాలి.
* వ్యవసాయ పనిముట్లు రైతులకు కిరాయి పద్ధతిలో దొరికేందుకు గ్రామీణ ప్రాంతాల్లో కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి.
* మార్కెట్లలో ట్రేడింగ్ లైసెన్స్ ఇచ్చే విషయంలో సులభతరమైన విధానాలను తీసుకురావాలి. పెరిగిందని, వ్యవసాయ శాఖ కాగితం , కలం శాఖగా కాకుండా పొలం,- హలం శాఖగా మారాలని, ఈ రెండు శాఖల పనితీరులో గుణాత్మక, గణనీయమైన మార్పు రావాలన్నారు. వ్యవసాయంలో పంటల మార్పిడీ విధానం, యాంత్రీకరణ, ఆధునిక సాగు పద్ధతులు పెంపొందించేందుకు వ్యవసాయ శాఖ తీవ్రంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. ఎఇఒ, రైతు బంధు సమితి కార్యాలయాలు కూడా రైతువేదికలోనే భాగంగా ఉండాలని, ఇందుకు అవసరమైన ఫర్నీచర్, ఇతర వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రగతిభవన్‌లో ఆదివారం జిల్లా స్థాయి వ్యవసాయాధికారులు, మార్కెటింగ్ శాఖాధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. అన్ని జిల్లాలకు చెందిన అధికారుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. వ్యవసాయాభివృద్ధి, రైతు సంక్షేమం విషయంలో ఈ రెండు శాఖలు నిర్వహించాల్సిన బాధ్యతలను ముఖ్యమంత్రి చెప్పారు. దాదాపు 8 గంటల పాటు జరిగిన సమావేశంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, ఎంపి కె.కేశవరావు, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, సివిల్ సప్లయిస్ కార్పోరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ చైర్మన్ మారం గంగారెడ్డి, సిఎంఒ అధికారులు స్మితా సభర్వాల్, భూపాల్ రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, సివిల్ సప్లయిస్ కమిషనర్ అనిల్ కుమార్, డైరెక్టర్ లక్ష్మీబాయి, సీడ్స్ కార్పోరేషన్ ఎండి కేశవులు తదితరులు పాల్గొన్నారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలియజేసింది. సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏడాదికి 4 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసే గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ రూపాంతరం చెందుతున్నదని, ఈ పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ ఎంతో బలోపేతం కవాలని, వ్యవసాయాధికారులు అడుగడుగునా రైతులకు అండగా నిలవాలి అని ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపునిచ్చారు.
ఒకే పంట వేసే విధానం పోవాలి
రైతులు ఎప్పుడూ ఒకే పంట వేసే విధానం పోవాలని, పంట మార్పిడీ విధానం రావాలని, పంట మార్పిడీ వల్ల ఉత్పత్తి పెరిగి లాభాలు వస్తాయని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. గ్రామాల్లో కూలీల కొరత ఉందని, వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగాల్సి ఉందని, పంటల సాగు విధానంలో ఆధునిక పద్ధతులు రావాలని, ఈ అంశాలపై రైతులకు వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2600 క్లస్టర్లలో నిర్మించిన రైతు వేదికలను వెంటనే వినియోగంలోకి తీసుకువచ్చి రైతులతో సమావేశాలు నిర్వహించాలని, పంటల సాగు, పంటల మార్పిడీ, యాంత్రీకరణ, ఆధునిక సాగు పద్ధతులు, మార్కెటింగ్ తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు.
సమావేశంలో ముఖ్యమంత్రి అధికారులకు ఇచ్చిన ఆదేశాలు :
* అన్ని రైతు వేదికలను వెంటనే ఉపయోగంలోకి తేవాలి. ఎఇఒ, రైతుబంధు సమితి కార్యాలయాలను రైతువేదికల్లోనే ఏర్పాటు చేయాలి. రైతు వేదికలకు మిషన్ భగీరథ ద్వారా మంచినీరు సరఫరా చేయాలి. మైక్ సెట్ సమకూర్చాలి. ఫర్నీచర్ ఏర్పాటు చేయాలి. ఏ క్లస్టర్లో అయినా ఏ కారణం చేతనైనా ఎఇఒ పోస్టు ఖాళీయైన, ఎవరైనా దీర్ఘకాలిక సెలవు పై వెళ్ళినా తాత్కాలిక పద్ధతిలో మరొకరిని నియమించాలి.
* రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి వ్యవసాయ మార్కెట్లే వేదిక. తెలంగాణ రాష్ట్రంలో వాటిని కొనసాగిస్తాం. రైతులు ఓ పద్ధతి ప్రకారం వచ్చి మార్కెట్లో పంటలు అమ్ముకునే విధానం తీసుకురావాలి. ఏ గ్రామానికి చెందిన రైతులు ఏ రోజు మార్కెట్ కు రావాలో నిర్ణయించి టోకెన్లు జారీ చేయాలి.
* రాష్ట్రంలో మార్కెట్ల వారీగా ఎంత ధాన్యం వస్తున్నది, అక్కడి వ్యాపారులకు ఎంతవరకు కొనుగోలు శక్తి ఉన్నది అనే వివరాలు సేకరించాలి. వరిలో ఆధునిక సాగు పద్ధతులు వచ్చాయి. వెదజల్లే పద్ధతి ద్వారా సాగు చేయడం వల్ల ఎకరానికి 10 వేల రూపాయల వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది. పత్తిలో సింగిల్ పిక్ పద్ధతి వచ్చింది. ఇంకా అనేక పంటల్లో కొత్త వంగడాలు, కొత్త పద్ధతులు వచ్చాయి. వాటి పై రైతులకు అవగాహన కల్పించాలి.
* యాంత్రీకరణ పెంచడం కోసం ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తుంది.
* మండల వ్యవసాయాధికారులను ఆగ్రానమిస్టులుగా మార్చడానికి నిరంతరం శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి.
* ఆధునిక సాగు పద్ధతులను అధ్యయనం చేయడానికి వ్యవసాయాధికారులు ఇజ్రాయిల్ పర్యటించాలి.
* పప్పుదినుసులు, నూనె గింజల సాగును ప్రోత్సహించాలి. పప్పులు, నూనె గింజలు పండించే ప్రాంతాల్లో దాల్ మిల్లులు, ఆయిల్ మిల్లులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చొరవ చూపుతుంది.
* ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలి. ఇందుకోసం స్ట్రాటజిక్ పాయింట్లను గుర్తించాలి.
* వ్యవసాయ పనిముట్లు రైతులకు కిరాయి పద్ధతిలో దొరికేందుకు గ్రామీణ ప్రాంతాల్లో కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి.
* మార్కెట్లలో ట్రేడింగ్ లైసెన్స్ ఇచ్చే విషయంలో సులభతరమైన విధానాలను తీసుకురావాలి.
ఏ గుంటలో ఏ ‘పంట’ వేశారు
RELATED ARTICLES