టిఎన్‌జిఒల ఆందోళన
ప్రజాపక్షం/హైదరాబాద్
ప్రభుత్వ ఉద్యోగులకు 16వ తేదీ దాటినా వేతనాలు రావడం లేదని టిఎన్‌జివో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సిఎం కెసిఆర్ హామీనిచ్చి ఆరు నెలలు దాటిందని, ఇప్పటికీ ఉద్యోగుల బదిలీలు అరకొరగానే ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లోని టిఎన్‌జివో రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం టిఎన్‌జివో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. అంతకుముందు “స్వామినాథన్ సంతాపసభ” జరిగింది. ఈ సందర్భంగా మామిళ్ల రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సిఎం కెసిఆర్ పరిపాలన 33 జిల్లాలను ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఏ జిల్లాలో కూడా క్యాడర్ స్ట్రెంత్‌ను స్థీరీకరణ చేయలేదన్నారు. 317 జివో ప్రకారం ఏ జిల్లా ఉద్యోగులను ఆ జిల్లాలోనే సర్దుబాటు చేస్తామని ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీనిచ్చారని గుర్తు చేశారు. కానీ అందుకు భిన్నంగా ఒక జిల్లాకు చెందిన ఉద్యోగి,మరో జిల్లాలో ఉన్నారని, పరస్పర, భార్యభర్తల బదిలీ సమస్యలు పరిష్కారించలేదని చెప్పారు. ఇహెచ్‌ఎస్ ఏ జిల్లాలో కూడా పని చేయడం లేదని, దీనిపై త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ అంశాలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, ఎపిలో పనిచేస్తున్న తెలంగా ఉద్యోగులను తిరిగి తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావాలన్నారు. సౌకర్యలేమితో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కొట్టుమిట్లాడుతున్నాయన్నారు. సిబిఎస్‌ను రద్దు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. టిఎన్‌జివో మాజీఅధ్యక్షుడు, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ
310జివో రావడానికి స్వామినాథన్ కారణమని, ఈ జివోనే తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణమైందని అన్నారు.
ఏవీ జీతాలు?
RELATED ARTICLES