ప్రజాపక్షం / హైదరాబాద్ : వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి 57 సంవత్సరాలు వయసు నిండిన అర్హులైన వారందరికి కొత్త ఆసరా ఫించన్లు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె.జోషి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొత్తగా అర్హులైన వారందరిని గుర్తించి ఇచ్చేందుకు తగు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. అర్హులైన వారిని గుర్తించేందుకు విధివిధానాలను కలెక్టర్లకు పంపించామన్నారు. 57 నుంచి 64ఏళ్ల వయసు ఉన్న 20లక్షల మందిని జిల్లాల్లో గుర్తించామని చెప్పారు. పెంచిన పెన్షన్లనే ఇవ్వాలని తెలిపారు. ఆసరా ఫించన్లు రూ.1000 నుంచి రూ.2016, వికలాంగులకు రూ.1500 నుంచి రూ. 3016 పెంచి ఇచ్చేందుకు తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు. పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్‌లతో ఆసరా ఫించన్లకు సంబంధించి చర్చించానన్నారు.
ఏప్రిల్ నుంచి 57ఏళ్లు నిండిన అర్హులకు ఆసరా!
RELATED ARTICLES