HomeNewsBreaking Newsఎరువుల సబ్సిడీలను పూర్తిగా తగ్గించేందుకే…

ఎరువుల సబ్సిడీలను పూర్తిగా తగ్గించేందుకే…

పిఎం ప్రణామ్‌ పథకాన్ని తీసుకొస్తున్న కేంద్రం
తెలంగాణ రాష్ర్ట రైతు సంఘం విమర్శ
ప్రజాపక్షం / హైదరాబాద్‌
ఎరువుల సబ్సిడీలను పూర్తిగా తగ్గించటానికే పిఎం ప్రణామ్‌ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ముం దుకు తీసుకువస్తున్నదని తెలంగాణ రాష్ర్ట రైతు సంఘం రాష్ర్ట అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భాగం హేమంతరావు, పశ్యపద్మ విమర్శించారు. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ ఖర్చులకోసం ప్రస్తుతం రాష్ర్ట ప్రభుత్వాలకు కేంద్రం ఇస్తున్న సహయంలో ఇక ముందు కేవలం రెండు శాతానికి పరిమితం చేయడానికి చర్యలు తీసుకోవడాన్ని ఒక ప్రకటనలో వారు తప్పుబట్టారు. ధాన్యం సేకరణ ప్రైవేటు వ్యక్తులకు,- శక్తులకు వదిలివేయటం వంటి కేంద్ర ప్రభుత్వ చర్యలు, గతంలో రైతుల పోరాటాల ఫలితంగా రద్దయిన రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను చాపకింద నీరులాగా దొడ్డిదారిన అమలుకు బరితెగించి పూనుకోటంలో భాగమేనని మండిపడ్డా రు. పిఎం ప్రణామ్‌ అంటే ప్రమోషన్‌ ఆఫ్‌ ఆల్టర్నేటివ్‌ న్యూట్రియంట్స్‌ అని తెలిపారు. వ్యవసాయ గత ఐదు సంవత్సరాలలో ఎరువులపై విపరీతంగా భారం పెరిగిందని, ఈ సాకుతో ఎరువుల సబ్సిడీలను పూర్తిగా తగ్గించడానికి ఉద్దేశింపబడిన పథకమే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత పథకం పిఎం ప్రణామ్‌ అని వివరించారు. గత ఐదు సంవత్సరాలలో యూరియా, ఎంఓసి, ఎన్‌పికె (నత్రజని ఫాస్ఫరస్‌ పొటాషియం) ఎరువుల అవసరము 21 శాతం పెరిగినట్లు ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవత్‌ ఆగస్టు 5వ తేదీన లోక్‌సభలో వెల్లడించారని రైతు సంఘం నాయకులు గుర్తు చేశారు. ఈ సంవత్సరం ఎరువుల సబ్సిడీ రూ. 2.25 లక్షల కోట్లు దాటే అవకాశం ఉందని కూడా తెలియజేశారని, ఈ భారాన్ని కేంద్ర ప్రభుత్వం మోయడానికి సిద్ధంగా లేదని, అందుకే మిగిలే రాయితీ మొత్తంలో 50 శాతం రాష్ర్ట ప్రభుత్వాలకు ఇచ్చి, అందులో 70 శాతం ఎరువుల తయారీ కోసం (సేంద్రియ ఎరువులు) మౌలిక సౌకర్యాల అభివృద్ధికి వినియోగించాలని చెబతున్నారని అన్నారు. మిగతా 30 శాతం నిధిని రైతులకు ప్రోత్సాహకాలను అందించటానికి రాష్ర్ట జిల్లా బ్లాక్‌ గ్రామ యూనిట్లను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించిందన్నారు. కేవలం సేంద్రియ ఎరువులే కాక కొద్ది మోతాదులో రసాయనిక ఎరువుల అవసరాన్ని కూడా ఆయా శాస్త్రవేత్తలు స్పష్టంగా చెబుతన్నారని, ఈ విషయాన్ని కూడా గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు పెరిగాయని సబ్సిడీ అమలు బాధ్యత నుండి వైదొలగటానికి కేంద్ర ప్రభుత్వం కుయుక్తి తప్ప మరొకటి కాదని బాగం, పశ్య పద్మ అన్నారు. భూసార పరీక్షలను నిర్వహించటం ద్వారా ఏ ఎరువును ఏ మోతాదులో వినియోగించాలి అన్నది రైతాంగాన్ని చైతన్య పరచకుండా కేవలం 2015 నుంచి 17 వరకు భూసార పరీక్షల కార్డులు ఇచ్చి వాటి గురించి ఎలాంటి అవగాహన రైతులకు కల్పించకుండా కేంద్ర పాలకులు వదిలేశారని ధ్వజమెత్తారు. ఇప్పుడు చేతులు దులుపుకునే పద్ధతుల్లో సేంద్రియ ఎరువుల తయారీకి రాష్ర్ట ప్రభుత్వాలను పురికొల్పుతూ, ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడం రైతులను పూర్తిగా పంటల దిగుబడి కి సంబంధించి దెబ్బతీయడానికే ఈ ప్రయత్నాలను ఉపసంహరించుకోవాలని బాగం హేమంతరావు, పశ్య పద్మ డిమాండ్‌ చేశార

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments