కంపెనీలకు కేంద్ర సర్కార్ ఆదేశాలు
న్యూఢిల్లీ: దేశంలో ఎరువుల ధరల పెంచాలని వివిధ కంపెనీలు తీసుకున్న నిర్ణయంపై కేంద్రం స్పందించింది. యూరియా మినహా ఇతర ఎరువుల ధరలను పెంచవద్దని పేర్కొం టూ, ఎరువుల కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. డిఎపి, ఎంఒపి, ఎన్‌పికె ఎరువుల గరిష్ట చిల్లర ధర (ఎంఆర్‌పి)ని పెంచడానికి వీల్లేదని ఎరువుల కంపెనీలను ఆదేశించింది. యూరియా మినహా ఇతర ఎరువులను పాత ధరలకే విక్రయించాలని స్పష్టం చేసింది. జూన్ నుంచి ప్రారంభమయ్యే ఖరీఫ్(వానాకా లం) సీజన్ ఆరంభానికి ముందే డిఎపి, కాం ప్లెక్స్(మిశ్రమ) ఎరువుల ధరలను పెంచాలని ఎరువుల కంపెనీలు నిర్ణయించిన విషయం తెలిసిందే. పెంపు సుమారు 58 శాతం ఉండటంతో అన్నింటి ధరలు భారీగా పెరగనున్న నేపథ్యంలో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. అయితే ఎరువుల కంపెనీలు తీసుకున్న నిర్ణయాన్ని తోసిపుచ్చుతూ ధరలు పెంచొద్దని కేంద్ర ప్రభుత్వం ఎరువుల కంపెనీలను ఆదేశించడంతో రైతులకు ఊరట లభించినట్లయింది.
ఎరువుల ధరలు పెంచొద్దు
RELATED ARTICLES