న్యూఢిల్లీ: పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్న ఎయిరిండియాలో ప్రవాస భారతీయులు(ఎన్‌ఆర్‌ఐలు) 100 శాతం వాటాలు కలిగి ఉండేందుకు ప్రభుత్వం బుధవారం అనుమతినిచ్చింది. ఎయిరిండియాలో 100 శాతం వా టాలకు ప్రాథమిక వేలం కోరిన సమయంలో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రధా ని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎయిరిండియాలో ప్రత్యక్షం గా లేక అప్రత్యక్షంగా విదేశీ పెట్టుబడులు, విదేశీ విమాన సంస్థల పెట్టుబడులు 49 శాతానికి మించడానికి లేదని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ఎయిరిండియా నియంత్రణ భారతీయుల చేతుల్లోనే ఉండాలని కూడా పేర్కొన్నా రు. ఎయిరిండియాలో ఆటోమేటిక్ రూట్ ద్వారా ఎన్‌ఆర్‌ఐలకు 100 శాతం ఎఫ్‌డిఐల ను అనుమతించినప్పటికీ, విదేశీ పెట్టుబడిని మాత్రం 49 శాతానికే పరిమితం చేశారు. ఎయిరిండియాలో ఎన్‌ఆర్‌ఐలు పెట్టుబడులు పెట్టేందుకు అనుమతించేందుకుగాను ఎఫ్‌డిఐ పాలసీలో సవరణలను కూడా ప్రభుత్వం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఆమోదించింది. ఎయిరిండియాలో ఇకపై ప్రభుత్వ వాటా అంటూ ఏమి ఉండబోదు. అది పూర్తిగా ప్రైవేట్ యాజమాన్యం కిందికి వెళ్లిపోనుంది. ‘దేశంలో సులభతర వ్యాపారానికి అనుగుణంగా ఎఫ్‌డిఐ పాలసీని ప్రభుత్వం సరళీకరించనున్నది’ అని కూడా పేర్కొంది. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాతో మాట్లాడుతూ ఎయిరిండియాపై ప్రభుత్వం బుధవారం తీసుకున్న నిర్ణయం ఓ మైలురాయి అని తెలిపారు. ఎయిరిండియా ప్రైవేట్ చేతికి వెళ్లనుంది. అది ప్రయాణికులకు సేవలందించనుంది. అంతేకాక ఈ నిర్ణయం పెట్టుబడి అవకాశాలను పెంచనున్నది అన్నారు. ఎయిరిండియాలో 100 శాతం వాటాలకు ఎన్‌ఆర్‌ఐలకు అనుమతించడం అన్నది సబ్‌స్టాన్షియల్ ఓనర్‌షిప్ అండ్ ఎఫెక్టివ్ కంట్రోల్(ఎస్‌ఒఇసి) నియమాలను ఉల్లంఘించడం కాబోదని తెలిపారు.ఎస్‌ఒఇసి ఫ్రేమ్‌వర్క్‌లో నడిచే విమా న పరిశ్రమలో ప్రభుత్వం లేక ఆ దేశ ప్రజల వాటా తగినంత ఉండాల్సి ఉంటుంది. ఎఫ్‌డిఐ నియమాల్లో ప్రభు త్వం అనేక మార్పులు తెచ్చిందని జవదేకర్ తెలిపారు.
2000 విదేశీ ధనప్రవాహం 360 బిలియన్ డాలర్లని జవదేకర్ తెలిపారు. కాగా గత ఐదేళ్ల కాలంలో (2014 విదేశీ ధన ప్రవాహం కేవలం 282 బిలియన్ డాలర్లు మాత్రమే. ఇది 14 సంవత్సరాలలో పొందినదాంట్లో 75 శాతం మాత్రమేనని ఆయన చెప్పారు. భారత్ మెల్లగా తయారీ కేంద్రం(మేన్యుఫ్యాక్చరింగ్ హబ్)గా మారుతోందని చెప్పారు. ప్రపంచంలో ఎఫ్‌డిఐలు ఎదురుగాలులను ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ ఆర్థిక పరిస్థితి కూడా గొప్పగాలేదు. అయినప్పటికీ విదేశీ ప్రత్యక్షపెట్టుబడులను ఆకర్షించడంలో భారత్ ప్రాధాన్యత దేశంగానే ఉందని జవదేకర్ తెలిపారు. ఎఫ్‌డిఐ పాలసీ సరళీకరణ కారణంగా విదేశీపెట్టుబడులను దేశం ఆకర్షించగలుగుతోందన్నారు.
కరోనావైరస్ నివారణ చర్యలను ప్రభుత్వం చేపట్టింది
కరోనావైరస్‌ను నివారించేందుకు ప్రభుత్వం ప్రొయాక్టివ్ చర్యలు చేపట్టిందని కేంద్ర మంత్రి జవదేకర్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ పరిస్థితిన రోజువారిగా పర్యవేక్షిస్తున్నారన్నారు. 21 విమానాశ్రయాల్లో 6లక్షలకు పైగా మందిని స్క్రీనింగ్ చేసినట్లు తెలిపారు. క్యాబినెట్ సమావేశానంతరం ఆయన మీడియాకు వివరాలు తెలిపారు.భారత్ సరిహద్దు దేశాలు… నేపాల్, భూటాన్, మయన్మార్ దేశాల నుంచి వచ్చిన 10 లక్షల మందిని స్క్రీనింగ్ చేసినట్లు చెప్పారు. ఇదిలావుండగా కరోనావైరస్ పరీక్షలు నిర్వహించడానికి పుణేలో ఒకే ఒక వైరాలజీ సంస్థ ఉంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం 19 అదనపు కేంద్రాలు ఏర్పాటుచేసి 15కు పైగా లాబరేటరీలను ఏర్పాటు చేస్తోంది. కొన్ని దేశాలవారికి ‘వీసా ఆన్ అరైవల్’ సదుపాయాన్ని రద్దు చేసినట్టు కూడా జవదేకర్ తెలిపారు. భారత్‌లో ఇప్పటి వరకు 28 కేసులు ధ్రువీకృతమయ్యాయని, వారిలో 16 మంది ఇటాలియన్‌లు కూడా ఉన్నారని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఇదివరకు పేర్కొన్న 12 దేశాలవారినే కాక, అంతర్జాతీయ ప్రయాణికులందరినీ విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ చేస్తున్నామని ఆయన తెలిపారు.
ఎయిరిండియా ప్రై‘వేటు’
RELATED ARTICLES