వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన వైసిపి సర్కారు
రూల్ 71 మోషన్ కింద నోటీసు ఇచ్చిన టిడిపి
చర్చకు అనుమతిచ్చిన మండలి చైర్మన్
ప్రజాపక్షం / అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మంగళవారం గందరగోళం నెలకొంది. ఉదయం నుంచి రాత్రి వరకు సమావేశం ఉత్కంఠగా సాగింది. ఉదయం వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టారు. దీన్ని టిడిపి అడ్డుకుంది. వికేంద్రీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ రూల్ 71 మోషన్ కింద నోటీసు ఇచ్చింది. బిల్లులు ప్రవేశపెట్టే ముందు తామిచ్చిన నోటీసుపై చర్చ జరపాలని మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. శాసనమండలిని కించపరిచే విధంగా మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు చేశారనే విషయాన్నిప్రస్తావించిన యనమల.. మండలికి క్షమాపణ చెప్పాలని డిమాం డ్ చేశారు. వికేంద్రీకరణ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందినందున చర్చ జరగాల్సిందేనని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. రూల్ 71 కింద బిల్లును తిరస్కరించే అధికారం మండలికి లేదని పేర్కొన్నా రు. దీనిపై స్పందించిన మండలి చైర్మన్… రూల్ 71 నోటీసుపై చర్చకు అనుమతిచ్చారు. అంతకుముందు గందరగోళ పరిస్థితుల నడుమ ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ, సిఆర్‌డిఎ బిల్లులను మండలిలో ప్రవేశపెట్టింది. ఆ బిల్లులను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు చైర్మన్ చైర్మన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టిడిపి సభ్యులు పోడియం ఎదుట ఆందోళనకు దిగా రు. రూల్ చర్చకు నోటీసు ఇచ్చినా బిల్లులను పరిగణనలోకి తీసుకోవడంపై వారు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం చైర్మన్ స్పందిస్తూ రూల్ చర్చ ప్రారంభించాలని సూచించారు.
ఎపి మండలిలో రగడ
RELATED ARTICLES