ప్రజాపక్షం/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తి నెలకొన్నది. రాష్ట్రంలోని రాజకీయ నాయకులు, ప్రజలు కూడా ఫలితాలపై ఆసక్తిగా చూస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో వేర్వేరుగా ఎన్నికలు జరిగాయి. 2014 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంగా ఎన్నికలు జరిగిన తర్వాత రెండు శాసనసభలుగా విడిపోయా యి. దీంతో 2019లో మొదటిసారి ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా ఆంధ్రప్రదేశ్‌లో నువ్వా నేనా అనే తరహా జరిగిన ఎన్నికల్లో వైసిపి గెలుస్తుందని టిఆర్‌ఎస్ జోస్యం చెబుతుంది. గత 2014 ఎన్నికల్లో కూడా వైసిపి గెలుస్తుందని కెసిఆర్ జోస్యం చెప్పినప్పటికీ అందుకు భిన్నంగా టిడిపి గెలిచింది. కాగా ఫెడరల్ ఫ్రంట్‌ను తెరమీదకు తీసుకొచ్చిన సిఎం కెసిఆర్, అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైసిపి అధినేత వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డిని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి.రామారావు కలిసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి ఓడిపోతుందని, వైసిపి గెలుస్తుందని అనేక సమావేశాలు, సభలలో సాక్షాత్తు కెటిఆర్ ప్రకటించారు. దీంతోఅటు టిఆర్‌ఎస్ శ్రేణులు, ఇటు మహాకూటమిలోని భాగస్వామ్యపక్షాలతో పాటు హైదరాబాద్‌లో ఉంటున్న ఆంధ్రప్రదేశ్ వాసులు కూడా ఎపి ఎన్నికల ఫలితాలను ఆసక్తిగా తిలకిస్తున్నారు. గురువారం వెలువడనున్న ఎపి ఫలితాల్లో టిఆర్‌ఎస్ జోస్యం ఈసారైనా ఫలిస్తుందా..? లేదా మరోసారి తారుమారు అవుతుందా మరి కొద్ది గంటల్లోనే తేలనుంది.
ఎపి ఫలితాలపై అమితాసక్తి
RELATED ARTICLES