అమరావతి/భోపాల్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్‌గా విశ్వభూషణ్ హరిచందన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి. ప్రవీణ్ కుమార్ హరిచందన్‌చే ప్రమాణం చేయించారు. గత ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంగా ఉపయోగించుకున్న భవనాన్ని కొత్త గవర్నర్ కోసం రాజ్‌భవ్‌నగా మార్చారు. కాగా, హరిచందన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాతం ఆంధ్రప్రదేశ్ నియమితులైన రెండవ గవర్నర్ కాగా, జూన్ 2014లో రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రానికి ప్రత్యేకంగా గవర్నర్‌గా నియమితులైన మొదటి వ్యక్తి. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రిమండలి సభ్యులు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, చీఫ్ సెక్రటరీ ఎల్‌వి సుబ్రమణ్యం, ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు. గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పురస్కరించుకుని రాజ్‌భవన్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్ర తా ఏర్పాట్లు చేశారు. గవర్నర్ ప్రమాణ స్వీకారానికి సిఎం, ఎంఎల్‌ఎలు హాజరయ్యేందుకు వీలుగా శాసనసభను మధ్యాహ్ననికి వాయిదా వేశారు. దీంతో ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు ప్ర త్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో అసెంబ్లీ నుంచి రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. కాగా, హరిచందన్ ఒడిశాకు చెందిన స్వాతంత్య్ర స మరయోధుల కుటుంబానికి చెందిన వారు. ఆ యనకు విశేష రాజకీయ అనుభవం ఉంది. భారతీయ జనసంఘ్‌లో 1971లో చేరడం ద్వా రా రాజకీయ ప్రవేశం చేసిన విశ్వభూషణ్ హరిచందన్.. ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక స భ్యునిగా, రాష్ట్ర జనరల్ సెక్రటరీగా పనిచేశారు. ఎమర్జెన్సీని వ్యతిరేకించినందుకు ఆయన 1975లో మీసా చట్టం కింద నిర్బంధానికి గురయ్యారు. 1977లో భారతీయ జనసంఘ్ జన తా పార్టీగా మారే వరకు ఆయన ఆ పదవుల్లో కొనసాగారు. తర్వాత బిజెపిలో చేరి 1980 నుంచి 1988 వరకు ఒడిశా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా పనిచేశారు. 1988లో విశ్వభూషణ్ జ నతా పార్టీలో చేరి తిరిగి మళ్లీ 1996 ఏప్రిల్‌లో బిజెపిలో చేరారు. ఆయనకు కవిత్వమంటే మ క్కువ. మొరుబొత్తాస్, రాణా ప్రతాప్, శేషఝలక్, అష్టశిఖ, మానసి పుస్తకాలను ఒరియాలో రచించారు. ఒక నాటికనూ రచించారు. చారిత్రక ప్రదేశాలను సందర్శించడం ఆయనకెంతో ఇష్టం.
ఎంపి గవర్నర్‌గా 29న టండన్ ప్రమాణం
ఇదిలా ఉండగా, మధ్యప్రదేశ్ గవర్నర్‌గా ఈనె ల 29న భోపాల్‌లోని రాజ్‌భవన్‌లో లాల్‌జీ టండన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే టండన్ ప్రస్తుతం బీహార్ గవర్నర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా, ఈనెల 28న ఆయన రాష్ట్రానికి చేరుకుంటారని రాజ్‌భవన్ అధికార ప్రతినిధి ఒకరు బుధవారం వెల్లడించారు. మధ్యప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రవిశంకర్ ఝా సోమవారం ఉదయం 11 గంటలకు టండన్‌తో ప్రమాణం చేయిస్తారని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్‌కు గవర్నర్‌గా ఉన్న ఆనందీబెన్ స్థానంలో టండన్‌ను నియమించారు. బెన్‌ను ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా బదిలీ చేశారు.
ఎపి నూతన గవర్నర్‌గా విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం
RELATED ARTICLES