ప్రజాపక్షం/శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టిడిఎల్పి ఉప నేత, శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎంఎల్ఎ కింజారపు అచ్చెన్నాయుడిని ఎసిబి అధికారులు అరెస్టు చేశారు. టిడిపి ప్రభుత్వ హయంలో ఇఎస్ఐ మందుల కొనుగోళ్లకు సంబంధించిన ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 7.20 గంటలకు భారీ బందోబస్తు మధ్య శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని తననివాసంలో ఉండగా అచ్చెన్నాయుడిని ఎసిబి అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో అచ్చెన్నాయుడితో సహా ఆరుగురిని ఎసిబి అరెస్ట్ చేసిం ది. ఎసిబి ప్రత్యేక బృందాలు అచ్చెన్నాయుడిని అదుపులోకి తీసుకుంటున్న సమయంలో గన్‌మెన్‌ను కూడా అనుమతించలేదు. టిడిపి ప్రభుత్వం లో అచ్చెన్నాయుడు కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు. ఇఎస్ఐ ఆసుపత్రులకు సంబంధించి మం దులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైసిపి సర్కారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తునకు ఆదేశించింది. ఇఎస్ఐలో అవినీతి జరిగినట్లు విజిలెన్స్ దర్యాప్తులో తేలింది. నకిలీ కొటేషన్లతో ఆర్డర్లు ఇచ్చినట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. విజిలెన్స్ కమిటీ నివేదిక ఆధారంగా ఎసిబి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.
ఎపి ఇఎస్ఐ స్కామ్ కేసులోఅచ్చెన్నాయుడు అరెస్ట్
RELATED ARTICLES