ఒక్కరోజులో 5041 కేసులు, 56 మరణాలు
ప్రజాపక్షం/అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఊహించని విధంగా పాజిటివ్ కేసులు నమోదవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గత ఐదు రోజులుగా నమోదవుతున్న కేసులు షాక్ ఇస్తున్నాయి. మరణాల రేటు కూడా అదే స్థాయిలో ఉండటం గుబులు రేపుతోంది. తాజాగా ఆదివారం 31,148 శాంపిల్స్‌ను పరీక్షించగా ఇందులో 5,041 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో అత్యధికంగా తూర్పు గోదావరిలో 647 కేసులు నమోదవగా, అనంతపురం జిల్లాలో 637, చిత్తూరులో 440, గుంటూరులో 354, కడపలో 225, కృష్ణా జిల్లాలో 397, నెల్లూరులో 391, ప్రకాశంలో 150, శ్రీకాకుళంలో 535, విశాఖపట్నంలో 266, విజయనగరంలో 241, పశ్చిమ గోదావరి జిల్లాలో 393 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 49,650కు పెరిగింది. ఈ మేరకు ఎపి ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో కరోనాతో 56 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో.. తూర్పుగోదావరి జిల్లాలో(10), శ్రీకాకుళంలో(8), కర్నూల్ జిల్లాలో(7), కృష్ణాలో (7), ప్రకాశం జిల్లాలో(4), అనంతపురం జిల్లాలో(3), కడపలో(3), విజయనగరంలో(3), గుంటూరు జిల్లాలో(2), చిత్తూరు జిల్లాలో(2)గా మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 642కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 1,106 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం 49,650కు పాజిటివ్ కేసులకు గాను 22,890 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 26,118 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఎపిలో కరోనా బీభత్సం
RELATED ARTICLES