పాట్నా: ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌లకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు మిన్నంటిన క్రమంలో బీహార్‌లో ఎన్‌ఆర్‌సి అమలు చేయబోమని నిర్ణయిస్తూ ఆ రాష్ట్ర అసెంబ్లీ మంగళవారం తీర్మానం ఆమోదించింది. జాతీయ పౌరపట్టిక (ఎన్‌పిఆర్)ను 2010లో ఉన్న రూపంలో అమలు చేస్తామని బీహార్ అసెంబ్లీ తీర్మానం ఆమోదించింది. స్పీకర్ విజయ్ కుమార్ చౌధరి ఈ తీర్మానాన్ని సభ ముందుంచగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. బీహార్‌లో ఎన్‌ఆర్‌సి అవసరం లేదని, ఎన్‌పిఆర్‌ను 2010 ఫార్మాట్‌లో కేంద్రం అమలుచేయాలని ఈ తీర్మానంలో పొందుపరిచారు. తీర్మానం ఆమోదానికి ముందు బీహార్ అసెంబ్లీలో పాలక ఎన్‌డిఎ సభ్యులు, విపక్ష సభ్యుల మధ్య ఎన్‌పిఆర్, ఎన్‌ఆర్‌సి అంశాలపై తీవ్ర వాగ్యుద్ధానికి దిగడంతో సభలో గందరగోళం చెలరేగింది. ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌లను విపక్ష నేత తేజస్వి యాదవ్ నల్ల చట్టాలుగా అభివర్ణిస్తూ వీటిపై ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. నూతన చట్టాలు దేశాన్ని మతపరంగా విభజిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. తేజస్వి యాదవ్ వ్యాఖ్యలను పాలక సభ్యులు తీవ్రంగా తప్పుపట్టారు. విపక్ష నేత రాజ్యాంగాన్ని అవమానించేలా మాట్లాడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఎన్‌ఆర్‌సి అవసరం లేదు
RELATED ARTICLES