కొంతమంది పార్టీ ఎంఎల్‌ఎలతో కలిసి అధికారపార్టీలో చేరిక
ఉప ముఖ్యమంత్రిగా అజిత్‌పవార్, మంత్రులుగా మరో 8 మంది ప్రమాణం
ఇంఫాల్ : మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కొద్దికాలంగా ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న ఆ పార్టీ నేత అజిత్ పవార్.. తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. అధికార పార్టీలో చేరారు. తనకు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేలతో కలిసి ఆదివారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమా ణ స్వీకారం చేశారు. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ ఉండగా.. ఇప్పుడు రెండో డిప్యూటీ సిఎంగా అజిత్ పవార్.. ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో గవర్నర్ రమేశ్ బయాస్ పవార్‌తో ప్ర మాణం చేయించారు. ఆయనతో పాటు మరో 8 మంది ఎన్‌సిపి ఎంఎల్‌ఎలు మంత్రులుగా ప్రమా ణం చేశారు. వారిలో ఛగన్ భుజ్‌బల్, దిలీప్ వాల్సే పాటిల్, ధర్మారావ్ అట్రాం, అదితి తట్కరే, హసన్ ముష్రీఫ్, ధనుంజయ్ ముండే, అనిల్ పాటిల్, సంజయ్ బస్సోడే ఉన్నారు. కార్యక్రమం లో మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్, డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్, ఎన్‌సిపి వర్కిం గ్ ప్రెసిడెంట్ ప్రఫూల్ పటేల్ కూడా హాజరయ్యారు. అజిత్ పవార్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేశారని, దానిని తాను ఆమోదించినట్లు స్పీకర్ రాహుల్ నార్వేకర్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి 40 మంది ఎన్‌సిపి ఎంఎల్‌ఎల మద్దతు ఉన్నట్లు మహారాష్ట్ర బిజెపి అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులే పేర్కొన్నారు. కాగా, అంతకుముందు పార్టీ ఎంఎల్‌ఎలు, నేతలతో విడిగా అజిత్‌పవార్ తన స్వగృహం దేవగిరిలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శరద్ పవార్‌కుమార్తె సుప్రియా సూలే సహా పలువురు ఎన్‌సిపి నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశం నుంచి సుప్రియ అర్ధంతరంగా బయటకు వెళ్లిపోయారు. ఈ భేటీపై తనకు సమాచారం లేదని ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ పేర్కొనడం గమనార్హం. ఇటీవల నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ తన కుమార్తె సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్‌ను పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించారు. అప్పటి నుంచి అజిత్ పవార్ అసంతృప్తిగా ఉన్నారు. శరద్ పవార్ వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకాన్ని ప్రకటన చేసిన రోజు నుంచి అజిత్ పవార్ మీడియా ఎదుటకు రాలేదు. తర్వాత తాను సంతోషంగానే ఉన్నానని ప్రకటించినా.. ఏదో మూల అసంతృప్తితోనే ఉన్నారు. ఇదే అదనుగా ముఖ్యమంత్రి శిందే వర్గం పావులు కదిపి అజిత్ పవార్‌తో చేసిన సంప్రదింపులు ఫలించాయని దాని ఫలితంగానే పార్టీలో చీలిక జరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి వచ్చే సంవత్సరంలో ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్‌సిపి మెజార్టీ సభ్యుల మద్దతు నాకే: అజిత్ పవార్
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మెజార్టీ సభ్యుల మద్దతు తనకే ఉందని అజిత్ పవార్ అన్నారు. ఎన్‌సిపి అధినేత శరద్ పవార్‌కు షాక్ ఇచ్చి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కేబినెట్ లో చేరిన ఆయన అనంతరం మాట్లాడారు. తాను రెండు రోజుల క్రితమే మహారాష్ట్ర ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేశానని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చెప్పుకొచ్చారు. భారతదేశ అభివృద్ధే తమ ప్రాధాన్య అంశంగా నిర్ణయించామని అన్నారు. అందుకే మహారాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని తాము నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశామని తెలిపారు. ఏయే నేతకు ఏయే మంత్రి పదవులు ఉంటాయన్న విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. తాము శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని, మరి బిజెపితో కలిసి ఎందుకు ఏర్పాటు చేయకూడదని ప్రశ్నించారు. ఎన్‌సిపి లెజిస్లేటివ్ పార్టీ షిండే ప్రభుత్వానికి మద్దతు తెలుపుతోందని, అలాగే, తమ పార్టీ గుర్తు మీదే భవిష్యత్తులోనూ పోటీ చేస్తామని అన్నారు.
ఎన్‌సిపిపై అజిత్‌పవార్‌తిరుగుబాటు బావుటా
RELATED ARTICLES