ప్రజా పక్షం / హైదరాబాద్ : ఆపద్ధర్మ మంత్రుల ప్రకటనలను, మద్యం, ధన ప్రవాహాన్ని నియంత్రించాలని రాజకీయ పార్టీ ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి చేశాయి. రెండు రోజుల్లో నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ శుక్రవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణలో తమకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నేరచరిత్రపై తప్పనిసరిగా పత్రికల్లో ప్రకటన ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. సమావేశంలో పాల్గొన్న రాజకీయ పక్షాలు అభిప్రాయాలు వారి మాటల్లో…
మంత్రులు హాజరు కాకుండా కుల సభలు ః మర్రి శశిధర్ రెడ్డి (కాంగ్రెస్)
మంత్రులు పాల్గొనే కుల, మత పరమైన సభలకు అనుమతులు ఇవ్వవద్దని సిఇఒ రజత్ కుమార్ కోరామని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. ఓటర్ల జాబితాలో పేర్లు, ఇతర అంశాలను చెక్ చేయాల్సిన సిబ్బంది కొరతా ఉందన్నారు. తన నియోజక వర్గంలో 30 నుండి 40 శాతం బిఎల్ లేరన్నారు. ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున పేర్లు గల్లంతు కావడంపై ఇప్పటికీ ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేశామన్నారు. దీనిపై తమ అసంతృప్తిని వెల్లడించామన్నారు. ప్రతి ఇంటికీ తిరిగి ఓటర్లకు స్లిప్ పంపిణీ చేసేందుకు అయినా సరైన సమయం ఇవ్వాలని కోరామన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ వెలువర్చిన తర్వాత బ్రాహ్మణ సమ్మెళనం పేరిట మీటింగ్ జరిగిందని, అందులో పబ్లిక్ సర్వెంట్ ఉన్న సభ్యుడు విఠల్, కెవి. రమణా చారి కూడా పాల్గొన్నా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోరా ? అని ప్రశ్నించామని శశిధర్ రెడ్డి వెల్లడించారు. ఆ సభల వివరాలను అడడగా వాట్సప్ సిఇఓకు పంపి ఫిర్యాదు కూడా చేశామని శశిధర్ రెడ్డి తెలిపారు.
ఇంకా ప్రకటనలు చేస్తున్నారుఃబాలమల్లేశ్, డాక్టర్ డి.సుధాకర్(సిపిఐ)
కోడ్ అమలులో ఉన్నా ఆపద్దర్మ ప్రభుత్వం ఇంకా అనేక ప్రకటనలు చేస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్.బాలమల్లేశ్, కార్యవర్గ సభ్యులు డాక్టర్ డి.సుధాకర్ విమర్శించారు. ఎన్నికల్లో ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు పట్టుబడుతున్నాయని ఈ ధన ప్రవాహాన్ని అడ్డుకోవాలని కోరారు. అలాగే ఆపద్ధర్మ ప్రభుత్వానికి , మంత్రులకు ఇంకా సహకరిస్తున్న సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయ పార్టీల ధన ప్రవాహం, మద్యం పంపిణీ చేయకుండా నిలువరించాలని కోరామని వారు వెల్లడించారు.
…………..
పోలింగ్ స్లిప్పుల బాధ్యత పార్టీలకే ఇవ్వాలిః బి.వినోద్ (టిఆర్ ఎంపి)
ఎన్నికల ప్రవర్తనా నియమావళి గురించి , అభ్యర్థుల నేర చరిత్ర గురించి సందేహాలు ఏవైనా ఉంటే అడిగి తెలుసుకోవచ్చని సిఇవో రజత్ కుమార్ సూచించారని వినోద్ అన్నారు. పోలింగ్ స్లిప్పుల పంపిణీ సక్రమంగా జరుగడం లేదని రాజకీయ పార్టీలు ఇసి దృష్టికి తీసుకెళ్ళామన్నారు. రాజకీయ పార్టీల ద్వారానే ఓటర్ స్లిప్పులు పంపిణీకి అనుమతించాలని కోరగా అందుకు రజత్ కుమార్ సమ్మతించారని ఎంపి వినోద్ వెల్లడించారు.
………………………
పార్టీల తిట్ల పురాణం పెరిగింది: రావుల చంద్రశేఖర్ (టిడిపి)
గడచిన వారం పది రోజుల్లోనే తిట్ల పురాణం రోజు రోజుకు పెరిగిందన్నారని టిడిపి పొలిట్ సభ్యులు రావుల చంద్రశేఖర్ వెల్లడించారు. క్రిమినల్ కేసుల వివరాలను పత్రికలు టివిల్లో యాడ్స్ ద్వారా తెలియజేయాలని ఇసి చెప్పిందని, దాని అమలు పర్చాలంటే ఖర్చు ఎక్కువ అవుతుందని అభ్యర్థులు చెబుతున్నారని, ఈ విషయంలో కొంత ఉప శమనం కల్గిలా ఏదైనా సూచనలు సలహాలు ఇవ్వాలని కోరామన్నారు.
్థ ఖర్చును రూ.8 లక్షలకు కుదించాలిః నంద్యాల నర్సింహారెడ్డి(సిపిఐ(ఎం)
పోటీ చేసే ఎంఎల్ అభ్యర్థి ఖర్చును రూ ఏడు, లేదా ఎనిమిది లక్షలకు కుదించాలని కోరామని సిపిఐ(ఎం) నాయకులు నంద్యాల నర్సింహారెడ్డి వెల్లడించారు. నిబంధనలు సక్రమంగా అమలు చేస్తే వందల కోట్ల రూపాయలు దొరుకుతాయని తెలిపామన్నారు. ఓటర్ల జాబితాను సరి చేశామంటున్నారు కానీ ఇంకా తప్పులు ఉన్నాయని చెప్పామన్నారు. ధన ప్రవాహం,మద్యం ప్రవాహం విషయాన్ని సిఇవోకు దృష్టికి తీసుకు వెళ్లామని నర్సింహారెడ్డి తెలిపారు.