చెన్నై : ఎన్నికల సంస్కర్తగా పేరుపొందిన కేంద్ర మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ టిఎన్ శేషన్ ఆదివారంనాడు కన్నుమూశారు.
టిఎన్ శేషన్ చేపట్టిన బాధ్యతలు :
1. 10వ భారత ప్రధాన ఎన్నికల కమీషనర్
పదవీ కాలం : 12 డిసెంబరు 1990 – 11 డిసెంబరు 1996
ఆ సమయంలో ప్రధాన మంత్రులు : వి.పి.సింగ్, చంద్రశేఖర్, పి.వి.నరసింహారావు, అటల్ బిహారీ వాజపేయి, హెచ్.డి.దేవెగౌడ
శేషన్ ముందు సిఇసి : వి.ఎస్.రమాదేవి
శేషన్ తరువాత సిఇసి : ఎం.ఎస్.గిల్
2. 18వ భారత కేబినెట్ సెక్రటరీ
పదవీ కాలం : 27 మార్చి 1989 – 23 డిసెంబరు 1989
నాటి ప్రధాన మంత్రి : రాజీవ్ గాంధీ
శేషన్ ముందు కేబినెట్ సెక్రటరీ : బి.జి.దేశ్ముఖ్
శేషన్ తరువాత కేబినెట్ సెక్రటరీ : వి.సి.పాండే
వ్యక్తిగత వివరాలు
జననం : 1932 డిసెంబరు 15 (వయస్సు: 87 సంవత్సరాలు)
పాలక్కాడు, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం కేరళ, భారత్)
నివాసము : చెన్నై, తమిళనాడు
పూర్వ విద్యార్థి : మద్రాసు క్రిస్టియన్ కళాశాల, హార్వార్డ్ విశ్వవిద్యాలయం
వృత్తి : ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఎఎస్)
పురస్కారాలు : రామన్ మెగసెసే పురస్కారం (1996)
చెన్నై : తిరున్ళ్ళు నారాయణ అయ్యర్ శేషన్ (టి.ఎన్.శేషన్ సుపరిచితుడు) ప్రస్తుతం పదవీవిరమణ చేసిన తమిళనాడు కేడరులోని 1955 బ్యాచ్ ఐ.ఎ.ఎస్ అధికారి. అతను భారత ఎన్నికల వ్యవస్థలో భారీ సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తిగా యావద్దేశ ప్రజలకు తెలిసిన వ్యక్తి. అతను 10వ భారత ప్రధాన ఎన్నికల కమీషనరుగా (1990-96) ఉన్నారు. ఐ.ఎ.ఎస్ అధికారిగా అతను 1989లో 18వ భారత కేబినెట్ సెక్రటరీగా కూడా పనిచేసారు. అతను ప్రతిష్ఠాత్మక రామన్ మెగసెసె అవార్డు గ్రహీత. ఆయన తీసుకున్న కొన్ని అసాధారణ నిర్ణయాలు భారత ఎన్నికల వ్యవస్థనే మార్చేశాయి. ఎన్నికల్లో డబ్బు ప్రవాహానికి శేషన్ చెక్ పెట్టారు.
ప్రారంభ జీవితం
తిరున్ళ్ళు నారాయణ అయ్యర్ శేషన్ 1932 డిసెంబరు 15న కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన తిరున్ళ్ళు గ్రామంలో జన్మించారు. ఆయన ‘బేసెల్ ఎవాంజెలిచల్ మిషన్ హయ్యర్ సెకండరీ పాఠశాల‘లో పాఠశాల విద్యను పూర్తిచేసారు. ఇంటర్మీడియట్ ను పాలక్కాడ్ ప్రభుత్వ విక్టోరియా కళాశాలలో చదివారు. ఆయన మద్రాసు క్రిస్టియన్ కళాశాల నుండి భౌతిక శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ చేసారు. శేషన్ ఐ.ఎ.ఎస్ పరీక్ష పాసయినప్పుడు మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో మూడు సంవత్సరాలు డిమానిస్ట్రేటర్ గా పనిచేసారు. తరువాత ఆయన హార్వార్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్లి ఎడ్వర్డ్ ఎస్. మాసన్ ఫెలోషిప్ పొందారు. అక్కడ పబ్లిక్ ఎడ్మినిస్ట్రేషన్ మాస్టర్ డిగ్రీని పొందారు. టి.ఎన్.శేషన్, ఎ.శ్రీధరన్ లు బి.ఇ.ఎం పాఠశాల, విక్టోరియా కళాశాలలో సహాధ్యాయులు. వీరిద్దరూ కాకినాడ లోని ఇంజనీరింగ్ (జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం)కు కూడా ఎంపికయ్యారు. అయినప్పటికీ ఇ.శ్రీధరన్ దానిని అనుసరించాలని నిర్ణయించుకున్నారు. కానీ శేషన్ మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో చేరాలని నిర్ణయించుకున్నారు.
వ్యక్తిగత జీవితం
1959లో దిండిగల్ సబ్ కలెక్టరుగా సేవలనందించే సమయంలో అతను జయలక్ష్మిని వివాహమాడారు. ఆమె కేరళ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ అయిన ఆర్.ఎస్. కృష్ణన్ కుమార్తె. పదవీ విరమణ చేసిన తరువాత శేషన్ పిల్లలు లేని కారణంగా కొద్దికాలంగా తన భార్యతో సహా వృద్ధాశ్రమంలోనే నివసిస్తూ వచ్చారు. ఆమె 2018 మార్చి 31న మరణించారు. శేషన్ తన సోదరుడు టి.ఎన్.లక్ష్మీనారాయణన్ (ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుకు మొదటి బ్యాచ్ వ్యక్తి) వలెనే సివిల్ సర్వీసులలో చేరాలని అనుకున్నారు. 1953లో శేషన్ ఐ.ఎ.ఎస్ కు హాజరగుటకు తక్కువ వయస్సు కలిగి ఉన్నారు. అయినప్పటికీ, తన సామర్ధ్యాలను పరీక్షించేందుకు, ఆయన ఇండియన్ పోలీస్ సర్వీస్ కోసం పరీక్షకు హాజరయ్యారు. 1954 బ్యాచ్ భారతదేశంలో మొదటి స్థానం పొందారు. తరువాత సంవత్సరం అతను 1955 బ్యాచ్ ఐ.ఎ.ఎస్ హాజరయ్యారు. మంచి ర్యాంకు సంపాదించారు. ఐ.ఎ.ఎస్ అధికారిగా అతను తమిళనాడు, కేంద్ర ప్రభుత్వాలలో వివిధ శాఖలలో సెక్రటరీగా తన సేవలనందించాడు. అతను కేబినెట్ సెక్రటరీగా, సివిల్ సర్వీసులో సీనియర్ భారత దేశ ప్లానింగ్ కమిషన్ సభ్యునిగా కూడా పనిచేసారు. తరువాత భారత ప్రధాన ఎన్నికల అధికారిగా తన సేవలనందించారు. ఆయన1997 రాష్ట్రపతి ఎన్నికలలో కె.ఆర్. నారాయణన్ ప్రత్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. 2012 అక్టోబరు 17 న మద్రాసు హైకోర్టు అతనిని చెన్నై లోని పచ్చయప్ప ట్రస్టుకు తాత్కాలిక నిర్వాహకునిగా ఉండవలసినదిగా నియమించింది.
ప్రధాన ఎన్నికల కమీషనర్
10వ ముఖ్య ఎన్నికల కమిషనరుగా శేషన్ పేరు పారదర్శకత, సమర్థతకు పర్యాయపదంగా మారింది. స్వచ్ఛమైన ఎన్నికలను నిర్వహించడం ద్వారా అతను దేశ ఎన్నికల వ్యవస్థపై తన అధికారాన్ని ముద్రించగలిగారు. ‘చట్టాన్ని ఉల్లంఘించడానికి ఎవరూ సాహసించరు.‘ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు, ఎన్నికలలో మార్పులను రాజకీయ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ‘ఎలక్షన్ వాచ్ డాగ్‘గా పేరుపెట్టాయి. తరువాత ‘Al-Seshan (Alsatian)‘గా అభివర్ణించాయి. ఎంతగా అంటే, ఎన్నికల ’పోరాటాలు’ గా ‘శేషన్ వెర్సస్ నేషన్‘గా పిలవబడేటంతగా పేరు పొందారు.
ప్రధాన విజయాలు
- ఎన్నికల ప్రక్రియలో చట్టం అమలు :
- ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కఠినంగా అమలుపరచడానికి పరికరాలు.
- అర్హత గల ఓటర్లకు ఓటరు కార్డులను జారీ చేయడం
- ఎన్నికలలో అభ్యర్థుల వ్యయంపై పరిమితి
- ప్రగతిశీలమైన, స్వతంత్ర ఎన్నికల కమిషన్ యంత్రాలు.
- ఎన్నికలను ఎదుర్కొంటున్న రాష్ట్రాల నుండి ఎన్నికల అధికారులను ఎంపిక చేయకుండా ఉండటం.
- అంతకు ముందు గల అనేక దుష్పరిమాణాలపై తీవ్ర చర్యలు
- ఓటర్లకు లంచం లేదా భయపెట్టడం, ఎన్నికల సమయంలో మద్యం పంపిణీని అడ్డుకోవడం, ప్రచారం కోసం అధికారిక యంత్రాల వినియోగాన్ని పూర్తిగా నియంత్రించడం,
- ఓటర్ల కుల లేదా మతపరమైన భావాలకు విజ్ఞప్తి చేసే వారిని నిరోధించడం, ప్రచారానికి ప్రార్థనా స్థలాలను వాడుకోకుండా ఆపడం,
- ముందస్తు వ్రాతపూర్వక అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్స్, అధిక శబ్దంతో సంగీతం వినియోగం వంటి వాటిపై కఠిన చర్యలు