కేటాయించాలని కెసిఆర్ నిర్ణయం
ప్రకటించిన ఆర్థిక సంఘం
ప్రజాపక్షం/ హైదరాబాద్ : వివిధ శాఖల ద్వారా స్థానిక సంస్థలకు రావాల్సిన బకాయిలపై త్వరలోనే ఆయా శాఖాధిపతులతో సమావేశాన్ని నిర్వహించాలని రాష్ట్ర ఆర్థిక సంఘం నిర్ణయించింది. స్థానిక సంస్థల పనితీరు, ఆర్థిక వనరులు, వాటి సేవలను పరిశీలించేందుకు త్వరలోనే పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించాలని నిర్ణయించింది. సిఎం కెసిఆర్ పంచాయతీలకు రూ.1,500 కోట్ల నిధిని కేటాయించేందుకు నిర్ణయించినట్లు ఆర్థిక సంఘం తెలిపింది. ఆ నిధులను ఆర్థిక సంఘం ద్వారా పంచాయతీలకు కేటాయించనున్నట్లు పేర్కొన్నది. హైదరాబాద్‌లో శుక్రవారం రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ రాజేశంగౌడ్‌తో కార్యదర్శి ఆర్థిక శాఖ కార్యదర్శితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ శాఖల నుంచి స్థానిక సంస్థలకు 2014- నుంచి 2017- ఆర్థిక సంవత్సరం వరకు రావాల్సిన నిధులు, పన్నులు, పన్నేతర ఆదాయ వివరాలపై సేకరించారు. 2014- స0వత్సరం పనుల ద్వారా రూ.6,446.82 కోట్లు, 2015 సంవత్సరానికి రూ.14,414.36 కోట్లు, 2016 గాను రూ.9,781.71 కోట్లు, 2017- స0వత్సరానికి రూ.65.99 కోట్లు పన్నుల ద్వారా ఆదాయం వచ్చింది. ఇందులో కమిషనర్ పంచాయతీరాజ్ నుంచి 2014- నుంచి 2017- వరకు సినరేజ్ ద్వారా రూ.2226.9 కోట్ల ఆదాయం పొందగా ఇందులో స్థానికం సంస్థలకు రూ.57.83 కోట్లు బదిలీ జరిగింది. మిగిలిన రూ.2169.07 కోట్ల నిధులు బదిలీ చేయాల్సి ఉంది. ట్రాన్స్ఫర్ అఫ్ అసైన్డ్ రెవిన్యూ ద్వారా 2014- నుండి 2017- వరకు వసూలైన మొత్తం రూ.2907.18 కోట్లలో స్థానిక సంస్థలకు మొత్తం రూ.2794.57 కోట్లు కేటాయించారు. గ్రామ పంచాయతి ఎన్నిక తర్వాత పంచాయతీ నిధుల, విధులకు సంబందించిన అంశాలపై సర్పంచులకు అవగాహనా సదస్సును నిర్వహించాలని రాష్ట్ర ఆర్థిక సంఘం నిర్ణయించింది.