HomeNewsTelanganaఎన్‌డిఎస్‌ఎ నిపుణుల బృందం మేడిగడ్డ’ పరిశీలన

ఎన్‌డిఎస్‌ఎ నిపుణుల బృందం మేడిగడ్డ’ పరిశీలన

ప్రజాపక్షం / జయశంకర్‌ భూపాలపల్లి /మహాదేవపూర్‌
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌లో నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డిఎస్‌ఎ) నిపుణుల బృందం గురువారం పర్యటించింది. గత అక్టోబర్‌ మాసంలో బ్యారేజ్‌ పియర్లు కుంగుబాటుకు గురైన విషయం తెలిసిందే. కాగా బ్యారేజ్‌ లోపాలను గుర్తించి బ్యారేజ్‌ పునరుద్ధరణకు సిఫారసులను సమర్పించేందుకు కేంద్ర జలశక్తి శాఖ ఐదుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఇటీవల నియమించింది. మాజీ కేంద్ర సం ఘం చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ఎన్‌డిఎస్‌ఎ నిపుణుల కమిటీ బృందం సభ్యులు బ్యారేజ్‌ను పరిశీలించారు. ఉదయం 8 గంటలకు మేడిగడ్డకు చేరుకున్న నిపుణుల బృందం సభ్యులు ముందుగా ఎల్‌టి సంస్థ క్యాంప్‌ కార్యాలయంలో ఇంజనీరింగ్‌ అధికారులతో ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించి బ్యారేజ్‌కు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. అనంతరం మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజ్‌ వద్దకు చేరుకుని బ్యారేజ్‌ కుంగిన ప్రాంతాన్ని పరిశీలించారు. బ్యారేజ్‌ డిజైన్‌, నిర్మాణం, లోపాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. అక్కడి నుండి మహారాష్ట్ర వైపు ఉన్న బ్యారేజ్‌ ఏడవ బ్లాక్‌లో కుంగిన 19,20,21 పియర్లను దిగువ భాగంలో క్షేత్ర స్థాయిలో పరిశీలన చేశారు. కుంగుబాటుకు గల కారణాలను అన్వేషించారు. కుంగిన పియర్‌ వద్ద ఉన్న గేట్ల పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు. బ్యారేజ్‌లోని ఆప్‌ స్త్రీమ్‌, డౌన్‌ స్ట్రీమ్‌లలోకి వెళ్లి లోపాలను అన్వేషించి సుధీర్ఘంగా చర్చించారు. బ్యారేజ్‌ సమస్యలు తలెత్తకుండా చేపట్టాలన్సిన పునరుద్ధరణ పనులపై చర్చించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు నిపుణుల బృందం సభ్యుల పరిశీలన కొనసాగింది. పరిశీలించిన అంశాల ఆధారంగా లోపాలపై లోతుగా విశ్లేషించి పునరుద్ధరణ చర్యలపై సిఫారుసులను తయారుచేసి ఎన్‌డిఎస్‌ఎకు అందించనున్నారు. కార్యక్రమంలో నిపుణుల కమిటీ సభ్యులు సెంట్రల్‌ వాటర్‌ పవర్‌ స్టేషన్‌ సైంటిస్ట్‌ ఆర్‌ పాటిల్‌, సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ మెటీరియల్‌ రిసెర్చ్‌ స్టేషన్‌ సైంటిస్ట్‌ యుసి విద్యార్థి, సిడబ్ల్యుసి బిసిడి డైరెక్టర్‌ శివకుమార్‌, గేట్స్‌, సిడబ్ల్యుసి, డిజార్డర్‌ అండ్‌ డిసిలిబెయెన్స్‌ డైరెక్టర్‌ రాహుల్‌ కుమార్‌, ప్రాజెక్ట్‌ ఇండ తిరుపతిరావు, డిఇఇ సురేశ్‌, ఇంజనీరింగ్‌ శాఖ అధికారులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments