విద్యార్థుల సంఖ్య ఆధారంగా గదులు
‘భౌతిక దూరం’పై విద్యాశాఖ కసరత్తు
కరోనా కట్టడికి చర్యలు
ప్రజాపక్షం/హైదరాబాద్ పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థులు కొవిడ్ భారిన పడకుండా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఎక్కువ మంది విద్యార్థులు హాజరయ్యే పాఠశాలలో షిఫ్ట్ పద్ధతిన తరగతులు నిర్వహించాలనే యోచనలో విద్యాశాఖ ఉన్నట్టు తెలుస్తోంది. ఉదయం, మధ్యాహ్నం తరగతులు నిర్వహించాలా? లేదా ఒక రోజు తప్పించి మరో రోజు తరగతులు నిర్వహించాలా అనే విషయమై అధికార యంత్రాం గం తర్జన భర్జన పడుతోంది. ఆయా పాఠశాలల గదులు, హాజరయ్యే విద్యార్థుల సంఖ్య ఆధారం గా తరగతుల నిర్వహణ ఆధారపడి ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నారు. భౌతిక దూరం పాటించకపోతే ఒక తరగతి గదిలో ఒక విద్యార్థికి కరోనా వైరస్ వ్యాప్తి చెందితే పక్కనే ఉన్న విద్యార్థులందరికీ కరోనా సోకే ప్రమాదం ఉన్నది అధికార యంత్రాంగం భావిస్తుంది. అందుకే భౌతికదూరం తప్పక పాటించాలని, తద్వారా తరగతి గదిలో ఉన్న విద్యార్థులకు కొంత రక్షణగా ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పాఠశాలలు పునః ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. అయితే కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా భౌతికదూరం కొన్ని పాఠశాలలు పెద్ద సమస్యగా మారనుంది. కొన్ని పాఠశాలలు మరి కొన్ని పాఠశాలలో తరగతి గదులు చిన్నగా ఉన్నాయి. అయితే గదులలో 20 నుంచి 25 మంది విద్యార్థులకు మించకుండా తరగతి గదిలో కూర్చొవల్సి ఉంటుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు గదులు, హాజరయ్యే విద్యార్థులను విద్యా శాఖ అంచనా వేస్తోంది. రాష్ట్రంలో ఒక్కో తరగతి గది 150 నుంచి 200 వరకు విద్యార్థులు ఉన్న ప్రభుత్వ పాఠశాలలు సుమారు వెయ్యి వరకు ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఒక బెంచికి ఒకరు లేదా ఇద్దరు మాత్రమే కూర్చొవల్సి ఉంటుంది. భౌతిక దూరాన్ని పాటిస్తే వెయ్యి పాఠశాలల పరిస్థితి ఏమిటని అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ఈ క్రమంలో ఒక్కో తరగతి గదిలో 50 నుంచి 100, 100 నుంచి 00 వరకు విద్యార్థులు ఉన్న పాఠశాలలో భౌతిక దూరం సాధ్యపడడం లేదు, వీరికి తరగతులను బోధించాలంటే కనీసం ఆయా పాఠశాలల్లో అదనపు తరగతి గదులైనా ఉండాలి. ఒక వేళ గదులు లేకపోతే ఇక విద్యార్థులను షిఫ్ట్‌ల చొప్పున విభజించి ఉదయం, మధ్యాహ్నాం తరగతులను నిర్వహించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ఎక్కువ విద్యార్థులుంటే ‘షిఫ్ట్’ పద్ధతిన బోధన?
RELATED ARTICLES