ప్రజాపక్షం/న్యూఢిల్లీ: కేరళలోని అలప్పుజలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు జరగాల్సిన ఎఐటియుసి 42వ జాతీయ మహాసభలు వాయిదా పడ్డాయి. కరోనా వైరస్ ప్రబలిన నేపథ్యంలో సభలు, సమావేశాలు, భారీ సమూహాలపై కేరళ ప్రభుత్వం ఆంక్షలు విధించిన దృష్ట్యా ఈ మహాసభలను వాయిదా వేస్తున్నట్లు ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి అమర్‌జీత్ కౌర్ తెలిపారు. ఈ మేరకు ఎఐటియుసి రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కౌన్సిల్ సభ్యులకు సర్క్యులర్‌లను పంపించినట్లు పేర్కొన్నారు. ఈ మహాసభను మే నెల 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరిగేలా రీషెడ్యూల్ చేసినట్లు తెలిపారు. అప్పటికల్లా కరోనా వైరస్ ప్రభావం తగ్గుతుందన్న ఆశాభావంతో ఉన్నట్లు ఎఐటియుసి నేతలు తెలిపారు.
ఎఐటియుసి జాతీయ మహాసభలు వాయిదా
RELATED ARTICLES