HomeNewsAndhra pradeshఎఎన్‌సి నుంచి వైదొలుగుతాం

ఎఎన్‌సి నుంచి వైదొలుగుతాం

దక్షిణాఫ్రికా కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధి ప్రిమ్‌రోజ్‌ కలూజా
అధికార ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (ఎఎన్‌సి)లో భాగమైన దక్షిణాఫ్రికా కమ్యూనిస్టు పార్టీ (ఎస్‌.ఎ.సి.పి) అధికార భాగస్వామ్య నుండి వైదొలగడానికి సన్నద్ధమైంది. జాతివివక్షత పట్ల కమ్యూనిస్టు పార్టీతో కలిసి వీరోచితంగా పోరాడిన ఎఎన్‌సి ఆ తర్వాత 1994 నుండి ప్రజాస్వామ్య ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ, దక్షిణాఫ్రికా ట్రేడ్‌ యూనియన్స్‌ (సిఎస్‌ఎటియు)లతో ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ మూడు పార్టీల కూటమికి నాయకత్వం వహించి ఐదు పర్యాయాలు అధికారాన్ని కైవసం చేసుకున్నాయి. జాతి వివక్షతా వ్యతిరేక ఉద్యమ ప్రతినిధిగా పేరొందిన నెల్సన్‌ మండేలా దక్షిణాఫ్రికా ప్రథమ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. నెల్సన్‌ మండేలా మరణానంతరం ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ నాయకత్వంపై అవినీతి, నేరపూరిత ఆరోపణలు పెరిగిపోయాయి. ప్రస్తుత అధ్యక్షులు సిరిల్‌ రాంఫొజా పాలనలో నిరుద్యోగం, పేదరికం మరింతగా పెరిగింది.సిపిఐ 24వ మహాసభలకు విచ్చేసిన దక్షిణాఫ్రికా కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్‌ కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యులు కామ్రేడ్‌ ప్రిమ్‌రోజ్‌ కలూజా ‘ప్రజాపక్షం’తో ఇంటర్వ్యూలో పై విషయాలు వెల్లడించారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒక పర్యాయం జరిగే దక్షిణాఫ్రికా కమ్యూనిస్టు పార్టీ మహాసభ జులై మాసంలో జరిగిందని, ఆఫ్రికన్‌ నేషన్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం నుండి వైదొలగాలన్న భావన పార్టీలో ప్రభలంగా నెలకొని వున్నందున వచ్చే డిసెంబరు లోగా ఈ అంశంపై “ప్రత్యేక మహాసభ” నిర్వహించి గత మహాసభ నిర్ణయించిందన్నారు. ఎఎన్‌సిలో భాగస్వామిగా వున్నందున కమ్యూనిస్టులు పలు పదవులలో వున్నప్పటికి కమ్యూనిస్టు ర్టీ ఎన్నికల గుర్తుతో పోటీకి అవకాశం లేదన్నారు. ప్రభుత్వంపై ప్రజలలో నెలకొన్న తీవ్ర అసంతృప్తిని దక్షిణాఫ్రికా కమ్యూనిస్టు పార్టీ పరిగణనలోకి స్వీకరించిందని, పార్టీ గుర్తుపై ఎన్నికల్లో పోరాటానికి సిద్ధపడాలని భావిస్తున్నందున ప్రత్యేక మహాసభ నిర్వహిస్తున్నామాని ఆమె వివరించారు. దేశంలో పెద్ద పార్టీలలో ఎఎన్‌సి తర్వాత కమ్యూనిస్టు పార్టీ రెండవ స్థానంలో వుందని ప్రేమ్‌రోజ్‌ చెప్పారు. మార్కిజం లెనినిజం సైద్ధాంతిక అవగాహనతో పార్టీ ముందుకు సాగుతుందన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments