16 ఏళ్లకుపైగా పనిచేస్తున్నప్పటికీ పరీక్షలు నిర్వహిస్తారా?
ప్రభుత్వం పునరాలోచించి నిర్ణయం ప్రకటించాలి
లేదంటే ఆందోళన తీవ్రతరం చేస్తాం : ఎఎన్‌ఎంల హెచ్చరిక
విధుల బహిష్కరణ… నిరసన ధరాలు
ప్రజాపక్షం/హైదరాబాద్ రాష్ర్టవ్యాప్తంగా ఎఎన్‌ఎంల సమ్మె గురువారం రెండో రోజుకు చేరింది. రెండవ ఏఎన్ ములు, యుపిఎస్‌సి ఎఎన్‌ఎంలు, ఇసి ఎఎన్‌ఎంలు, ఆర్‌బిఎస్‌కే ఎఎన్‌ఎం, లు ఆర్‌సిహెచ్ ఎఎన్‌ఎమ్‌లు లాంటి వివిధ కేటగిరీల 5,600 మంది ఏఎన్‌ఎంలు విధులు బహిష్కరించారు. ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు నిర్వహించి నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నారు. ఎఎన్‌ఎంఎల సమస్యల పరిష్కారం పట్ల రాష్ర్ట ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని ఎఐటియుసి రాష్ర్ట ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహా విమర్శించారు. సమ్మెకు సంఘీభావంగా హిమాయత్ నగర్‌లోని
ఎఐటియుసి రాష్ర్ట కార్యాలయం వద్ద నిరసన ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నరసింహా మాట్లాడుతూ చర్చల సందర్భంగా హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు వైఖరి తీవ్ర ఆక్షేపణీయంగా ఉన్నదన్నారు. ఇతర డిపార్ట్‌మెంట్‌లో లేని ఇబ్బందులు కేవలం మెడికల్ డిపార్ట్‌మెంట్‌లోనే ఉన్నాయని చెప్పటం విడ్డూరంగా ఉన్నదని, ఏఎన్‌ఎంల ముఖ్య డిమాండ్ ఉద్యోగాల క్రమబద్ధీకరణ విషయం ప్రభుత్వం పునరాలోచించి నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గత 16 సంవత్సరాల పైబడి పని చేయుచున్నటువంటి ఏఎన్‌ఎం లతో పరీక్షలు రాపించాలని ఆలోచించటం అనాలోచితమైన నిర్ణయం అని వారు తెలియజేశారు. కరోనా లాంటి అతి క్లిష్ట సమయంలో కింది స్థాయిలో ఉండి తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి విధులు నిర్వహించిన ఆరోగ్య సిబ్బంది పట్ల రాష్ర్ట ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలని నరసింహా విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల నిధులతో ఎన్హెచ్‌ఎం స్కీము నడుస్తున్నప్పటికీ వారి నియామక ప్రక్రియలో , ప్రతిరోజు పనిలు తీసుకునే విధానంలో, మొత్తం రాష్ర్ట ప్రభుత్వమే చూస్తున్నదని, కాబట్టి వారిని పర్మనెంట్ చేయాలని అన్నారు. కాని ఏఎన్‌ఎం లను రెండవ శ్రేణి పౌరుల లాగా చూస్తుండడం అన్యాయమని అన్నారు. అనేకమంది సిబ్బంది రాష్ర్ట వ్యాప్తంగా తమ ఏజ్ లిమిటెడ్ ను సైతం దాటి వెళ్లారని, గత 16 సంవత్సరాలుగా కనీస వేతనాలకు నోచుకోకుండా విధులు నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని 240 రోజులు పైబడి ఒక సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగిని రెగ్యులరైజ్ చేయాలని ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ చెప్తున్నప్పుడు కూడా అధికారులు ప్రభుత్వం కార్మిక హక్కుల్ని చట్టాలని పాటించుకోవడం లేదని మండిపడ్డారు. నిరసన కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి రామా రాజేష్ ఖన్నా , ఎఐటియుసి రాష్ర్ట కార్యదర్శి నండూరి కరుణ కుమారి, హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కమతం యాదగిరి, నేతలు బాపు యాదవ్, ఎఎన్‌ఎంల సంఘం నాయకురాలు కె.తిరుపతమ్మ , కె.లలిత, శోభ , ఎ.గుణవతి, వైదుర్య నాగమణి, లలిత, రేచల్ తదితరులు పాల్గొన్నారు
ఎఎన్‌ఎంలతో రాతపరీక్షలుఅనాలోచిత చర్య
RELATED ARTICLES