ప్రజాపక్షం/ మహబూబాబాద్ బ్యూరో మహబూబాబాద్ ఎంపి మాలోతు కవితకు ప్రజాప్రతినిధుల కోర్టు ఆరు నెలల జైలు శిక్షను విధించింది. జైలు శిక్షతో పాటు రూ. 10 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ప్రభావితం చేసేవిధంగా డబ్బులు పంచారని ఆమెపై 2019లో కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసుపై శనివారం విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధుల కోర్టు ఆరు నెలల జైలు శిక్షతోపాటు జరిమానా విధించింది. మాలోతు కవితపై కోర్టు విధించిన రూ.10 వేల జరిమానా ఆమె చెల్లించి, బెయిల్ కోసం అప్పీల్ చేసుకున్నారు. దీంతో కోర్టు వెంటనే ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. మాలోత్ కవిత డోర్నకల్ ఎంఎల్ఎ రెడ్యానాయక్ కూతురు. 2009లో మహబూబాబాద్ ఎంఎల్ఎగా కాంగ్రెస్ పార్టి నుండి పోటీ చేసి విజయం సాదించారు . అదే విధంగా 2019 లోక్ సభ ఎన్నికలలో మహబూబాబాద్ టిఆర్ ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్‌పై విజయం సాదించారు.
ఎంపి మాలోతు కవితకు 6 నెలల జైలు శిక్ష
RELATED ARTICLES