HomeNewsBreaking Newsఎందుకుజోక్యం చేసుకోవాలి?

ఎందుకుజోక్యం చేసుకోవాలి?

మతమార్పిళ్లపై ప్రభుత్వానికి మార్గదర్శకాలు ఇవ్వాలన్న పిటిషన్‌ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ

న్యూఢిల్లీ : దేశంలో మోసపూరిత మతమార్పిళ్లను అరికట్టేలా కేంద్ర ప్రభుత్వానికి మార్గదర్శకాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందు కు దేశ సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. పిటిషనర్లపై అసహనం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. ఈ విషయంలో కోర్టులు ఎందుకు జోక్యం చేసుకోవాలని ప్రశ్నించింది. ఇలాంటి విషయాల్లో న్యాయస్థానాలు ప్రభుత్వానికి మాండమస్‌ రిట్‌లను ఎలా జారీ చేయవచ్చో చెప్పాలని సిజెఐ జస్టిస్‌ డివై చంద్రచూడ్‌, జస్టిస్‌ జెబి పర్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాతో కూడిన ధర్మాసనం చురకలు అంటించింది. కర్ణాటకకు చెందిన న్యాయవాది జిరోమ్‌ అన్టో హిందువులు, మైనర్లను మోసపూరిత మతమార్పిళ్లు చేయిస్తున్నారంటూ ఈ ప్రజాప్రయోజన వాజ్యాన్ని దాఖలు చేశారు. పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. పిల్‌ ఒక ఆటబొమ్మలా తయారైందని పేర్కొంది. ఇలాంటి వ్యాజ్యాలను ఎక్కడ విచారించాలని వాదనకు.. తామేం సలహాలు ఇచ్చేవాళ్లం కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. లడఖ్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ రద్దు..: లడఖ్‌ హిల్‌ కౌన్సిల్‌ ఎన్నికలకు సం బంధించి అక్కడి ఎన్నికల సంఘం ఆగస్టు 5న జారీ చేసిన నోటిఫికేషన్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఏడు రోజుల్లోగా కొత్త నోటిఫికేషన్‌ జారీ చేయాలని ఆదేశించింది. నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు నాగలి గుర్తును కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ లడఖ్‌ పరిపాలనా శాఖ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ అహసానుద్దీన్‌ అమానుల్లాతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. లడఖ్‌ పరిపాలనా శాఖకు లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది. లడఖ్‌లో అటానమస్‌ హిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌కు ఈనెల 10న ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో పార్టీ గుర్తుపై పోటీ చేసేందుకు ఎన్‌సి అభ్యర్థులను అనుమతిస్తూ ఏకసభ్య ధర్మాసనం ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ.. లడఖ్‌ పరిపాలన శాఖ వేసిన పిటిషన్‌ను జమ్ముకశ్మీర్‌, లడఖ్‌ హైకోర్టు తోసిపుచ్చింది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments