మొక్కల సంరక్షణ బాధ్యత ప్రజాప్రతినిధులదే !
కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి గ్రీన్ కమిటీలు
మొక్కలు నరికితే నష్టపరిహారం రూ. లక్షల్లోనే
ప్రజాపక్షం / హైదరాబాద్ ; తెలంగాణకు హరితహారం కింద నాటిన మొ క్కలు ఈ ఎండాకాలంలో ఎండి పోకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మొక్కలు ఎండి పోకుండా వాటిని పరిరక్షించుకునేందుకు పార్లమెంటు సభ్యు లు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులకు బాధ్యతలను అప్పగించనుంది. వర్షాకాలం జూన్, జులై వరకు మొక్కలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవడంలో భాగంగానే ప్రజాప్రతినిధులకు బాధ్యతలను అప్పజెప్పిన ట్లు సమాచారం. ఇక గ్రామ, పట్టణ స్థాయి నుంచి పచ్చదనంను అభివృద్ది చేసే లక్ష్యం తో జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన ‘గ్రీన్ కమిటీలు’ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించినట్లు తెలిసింది. తెలంగాణ కు హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలు ఈ వేసవి నేపథ్యంలో ఎం డకుండా ఉండేందుకు సుమారు 60 రోజుల పాటు ఒక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనున్నారు. ప్రతి మండలంలోనూ హరితహారం మొక్కలు ఎండి పోకుండా చూసేందుకు కలెక్టర్ అధ్యక్షతన ఈ గ్రీన్ కమిటీల బాధ్యులుగా రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు ఉండనున్నారు. హరిత తెలంగాణ లక్ష్యంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమం అమ లు చేస్తున్నప్పటికీ నాటిన మొక్కలు మూన్నా ళ్ల ముచ్చటేనన్నట్లుగా ఎండి పోతున్నాయి. మొత్తం రాష్ట్రం భూభాగంలో పచ్చదనం విస్తీ ర్ణం 23,108 చదరపు కిలో మీటర్లుగా ఉంది. హరితహారం కింద ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 496 నర్సరీల ద్వారా ఆరు విడతల్లో సుమారు 20 కోట్ల మొక్కలు నాటగా అందులో సగం కూడా బతకలేదు. అటవీ ప్రాంతాల్లో అయినా మొక్కలను సంరక్షించుకోవాలని భావిస్తున్న అటవీశాఖ జిల్లాల వారీగా కలెక్టర్లకు బాధ్యతలను అప్పగించింది. తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల వారీగా చూస్తే ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ మూడు జిల్లాల్లో అత్యధికంగా అడువులు విస్తరించి ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 35.32 శాతం అడువులు ఉండగా, నిజామాబాద్ జిల్లాలో 30 శాతం, మహబూబ్‌నగర్ జిల్లాలో 27 శాతం అడవులు ఉన్నాయి. అటవీ విస్తీర్ణం తక్కువగా ఉన్న నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోనూ హరితహారం మొక్కలది అదే దుస్థితి నెలకొని ఉంది. మొక్కలు నాటేటప్పుడు ఉన్న శ్రద్ద ఆ తర్వాత ఉండడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో జిల్లా స్థాయి గ్రీన్ కమిటీలు నియమించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.